Home Videos

యాంటీ బయాటిక్స్ ఎలా వాడాలి..అవి ఎలా పని చేస్తాయి…!

ఒక వ్యాధిని తగ్గించడంలో యాంటీ బయాటిక్స్ ప్రభావ వంతంగా పనిచేస్తాయి. ఈ కరోనా సమయంలో డ్రగ్స్ విచ్చలవిడిగా వాడుతున్నారు. వీటిని ఎక్కువగా వాడేయడం, డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండా వాడడం ప్రమాదకరం.యాంటీ బయాటిక్స్‌ని తట్టుకుని ఉండే బ్యాక్టీరియా బాగా విస్తరిస్తోంది. కొన్ని యాంటీ బయాటిక్స్‌ని అతిగా వాడడం వల్ల వీటిని తట్టుకుని ఉండే శక్తి బ్యాక్టీరియాకి వస్తోంది.

ఈ మధ్య కాలంలో ఒక డిసీజ్ కి వచ్చేసి ఒకటి కంటే ఎక్కువ యాంటిబయాటిక్స్ వాడుతున్నారు. ఇది అసలుకే ప్రమాదంగా మారనుంది. చిన్న జ్వరం,జలుబు వచ్చినా సోంతగా మెడికల్ షాపుకి వెళ్లి యాంటిబయాటిక్స్ వాడటం వల్ల మరింత ప్రమాదకరంగా మారవచ్చంటున్నారు డాక్టర్లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here