Home News Updates

సరిహద్దుల్లో బయటపడిన మరో సొరంగం

జమ్మూకాశ్మీర్ ప్రాంతంలో మరో సొరంగ మార్గాన్ని బయట పెట్టాయి భద్రతా దళాలు. కఠువా జిల్లాలోని పన్సార్ ప్రాంతంలో బీఎస్ఎఫ్ సైనికులు యాంటీ టన్నెలింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‎లో 150మీటర్ల పోడవు 30 అడుగుల లోతు గల సోరంగ మార్గాన్ని సైనికులు గుర్తించారు. అయితే ఇదే ప్రాంతంలో గతేడాది జూన్‎లో అక్రమంగా ఆయుధాలు మోసుకొస్తున్న పాకిస్థాన్ డ్రోన్ ను భద్రతా బలగాలు కూల్చివేశాయి.

నవంబర్ 2019లో ఉగ్రవాదులు ఇక్కడి నుంచి చొరబడేందుకు ప్రయత్నం చేయగా భారత సేనలు తిప్పికొట్టాయి. గడిచిన ఆరునెలల కాలంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు, చొరబాటుదారులు ఏర్పాటు చేసుకున్న ఆరు సొరంగాలు జమ్మూ సాంబా, హీరానగర్ కఠువా ప్రాంతాల్లో బయటపడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here