కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ పెట్టిన ఏపీ సర్కార్ ఎల్లుండి నుంచి పగటిపూట కూడా కర్ఫ్యూ అమలుకి సిద్దమైంది. ఏపీ గత కొన్ని రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక పగలు కూడా కర్ఫ్యూ పెట్టకపోతే వైరస్ విస్తరణ ఆపలేం అన్న అభిప్రాయాన్ని సీఎం ముందు అధికారులు వ్యక్తం చేయడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో కర్ఫ్యూ సమయంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులకు అనుమతి ఇవ్వనున్నారు. 12 గంటల తర్వాత అత్యవసర సేవలు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. ఆ సమయంలో 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఈ ఆంక్షలను రెండు వారాల పాటు అమలు చేయనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో బెడ్స్ పెంచాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.