Home News

బ్రేకింగ్: ఎల్లుండి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఏపీ ప్రభుత్వం

ఈ నెల 20న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ రూపకల్పన పై కసరత్తు చేసిన ప్రభుత్వం ఒక రోజు బడ్జెట్ సమావేశం నిర్వహించనుంది. అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందిన వెంటనే కరోనా దృశ్య సమావేశాలు ముగించే యోచనలో ఉంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశమై 6 నెలలు కావడంతో జూన్ 3 వ తేది లోపల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కరోనా కష్ట కాలంలో బడ్జెట్ రూపకల్పన జగన్ సర్కార్ కి కత్తి మీద సాములా మారింది.

గతేడాది అనుభవాలతో ఆదాయ, వ్యయాల అంచనాలను రూపొందిస్తున్న ఆర్ధిక శాఖ. రూ. 2.28 లక్షల కోట్ల నుంచి రూ. 2.38 లక్షల కోట్ల మధ్యలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. గతేడాది ఆదాయ అంచనాలను చేరుకోలేకపోయిన ఏపీ సర్కార్ గ‌త ఏడాది సుమారు 1.82 ల‌క్షల కోట్ల వ్య‌యం కాగా.. ఆదాయం కేవ‌లం 77, 560 కోట్లు మాత్ర‌మే అని చూపించింది. గతేడాది రూ. 1 లక్ష కోట్లకు పైగా బడ్జెట్ లోటు ఉందంటున్నారు ఆర్ధిక శాఖ అధికారులు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనూ ఆదాయ-వ్యయాలు గతేడాది రీతినే ఉండొచ్చని ఆర్ధిక శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే మూడు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్టును ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తోన్న ప్రభుత్వం. మిగిలిన 9 నెలల కాలనికి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here