Home News Updates

కరోనా అనుమానం తో చైనా లో ఉండి పోయిన ఆ యువతి ఎవరు…

బాగా చదివింది.. వుద్యోగం సంపాదించింది.. శిక్షణ కోసం చైనా వెళ్ళింది. ఇంతలో కరోనా వైరస్ కలకలం మొదలైంది.. భారత ప్రభుత్వం స్పందించి.. తిరిగి రప్పించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. లగేజీ తీసుకుని స్నేహితులతో కలిసి హడావిడిగా విమానాశ్రయానికి బయలుదేరింది. ఆ ఒత్తిడిలో ఆమె శరీరం కాస్త వెచ్చబడింది. విమానం ఎక్కేముందు పరీక్షించిన అక్కడి వైద్యులు కరోనా వైరస్ సోకిందేమోనని అనుమానించారు. ఆమె ప్రయాణాన్ని అడ్డుకున్నారు. ఇక అక్కడే చికిత్స పొందుతోంది. కరోనా సోక లేదు. కానీ అనుమానం అలా కట్టి పడేసింది .. ఇక ఏముంది చైనా లోనే ఉండి పోయింది ..

‘అమ్మా.. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. అయినా ఇక్కడి అధికారులు అనుమానంతో అడ్డుకుంటున్నారు. ఇక్కడ ఉండలేకపోతున్నా..’ అని వాట్సప్‌లో వీడియో సందేశం పంపించింది. బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన ఆ యువతీ కి వచ్చిన కష్టమిది.. తను చైనాలోని వూహాన్ పట్టణంలో చిక్కుకుపోయింది. ఇక్కడ తల్లి తన కూతురి రాకకోసం పరితపిస్తోంది..

తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఒత్తిడి కారణంగా శరీర ఉష్ణోగ్రత పెరిగిందని ఆమె వీడియోలో పేర్కొంది. దీంతో జ్యోతి తల్లి, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే జ్యోతిని రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ మేరకు విదేశ మంత్రిత్వ శాఖ కు లేద్ఖ రాసారు … కర్నూల్ కలెక్టర్ కూడా ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here