Home Entertainment Television

యాంకర్ అనసూయకు రేష్మీ ఛాలెంజ్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన రష్మీ గారు , జబర్దస్త్ ఫేమ్ యాంకర్ రష్మీ గారు ఈరోజు నానక్రాంగూడ లోని తన నివాసంలో మొక్కలు నాటారు మరో ముగ్గురిని నామినేట్ చేశారు , ఈ సందర్భంగా రష్మీ మాట్లాడుతూ , మానవునికి కావాల్సిన ప్రాణ వాయువైన ఆక్సిజన్ ను ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ ను పీల్చుకుంటాయి.

అంతే కాక పరిసరాలలో వున్న కుళ్ళు వాసనలను, కలుషితమైన గాలిని గ్రహించుకొని స్వచ్చపరుస్తాయి. ఇలా మనకి ఎన్నో ఉపయోగాలున్నాయి. మనస్సుంటే మొక్కలు నాటడానికి ఖాళీ స్థలం లేదనే ప్రసక్తి లేదు. మొక్కలు నాటి రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను , వాతావరణ లో హెచ్చుతగ్గులను సమతుల్యత చేయడానికి మొక్కలు తప్పకుండా పెంచాలి . అందుకే నేను నాటను కదా నాతో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆగకుండా మరో ముగ్గురిని యాక్టర్ సత్యదేవ్, ప్రియమైన మిత్రురాలు అనసూయ మరియు శేఖర్ మాస్టర్ గార్లని ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించాలి అని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో బాగంగా మొక్కలు నాటిన రష్మీ గారిని ఎంపీ సంతోష్ కుమార్ గారూ ప్రత్యేకంగా అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here