Home Entertainment Reviews

30 రోజుల్లో ప్రేమించటం ఎలా అంటున్న యాంకర్ ప్రదీప్

టాలీవుడ్ లో ఉన్న అతితక్కువ మంది మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా ఒకరు. ప్రస్తుతం ఈయనే టాప్ యాంకర్ కూడా. ఈయన తర్వాతే రవి ఉన్నాడు. వరస షోలు చేసుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ప్రదీప్ మాచిరాజు.

బుల్లితెరపై చాలా బిజీగా ఉన్న ప్రదీప్ ఇప్పుడు వెండితెరపైకి రానున్నాడు. త్వరలోనే ఈయన డెబ్యూ ఇవ్వబోతున్నాడు. హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ కూడా పూర్తపోయింది. గతంలోనే కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసాడు ప్రదీప్. తొలిసారి లీడ్ రోల్ చేస్తున్నాడు ఈయన. ఈ చిత్రానికి 30 రోజుల్లో ప్రేమించటం ఎలా అనే టైటిల్ కూడా ఖరారు చేసారు.

ప్రేమించటం ఎలా సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. ఇందులో అమృత అయ్యర్ అనే కొత్తమ్మాయి ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఈ సినిమా షూటింగ్ లోలనే ఆ మధ్య గాయపడ్డాడు ప్రదీప్. దాంతో కాలికి చిన్న ఫ్రాక్చర్ అయింది. ఆ గాయం అలాగే పట్టుకుని చాలా రోజుల పాటు షూటింగ్ చేశాడు ప్రదీప్. కానీ రోజురోజుకి ఎక్కువవడంతో నొప్పి మరీ భరించలేనంతగా కావడంతో సర్జరీ చేయించుకుని 40 రోజుల పాటు స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు ఈయన. ఈ మధ్యే మళ్లీ వచ్చి షూటింగ్ పూర్తి చేసాడు. 30 రోజుల్లో ప్రేమించటం ఎలా..? అనేది పీరియాడికల్ లవ్ స్టోరీ. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో మనం తరహాలో సాగే అందమైన ప్రేమకథ ఇది. ధీనికోసం మంచి బడ్జెట్ పెడుతున్నారు. కచ్చితంగా ఈ చిత్రంతో హీరోగా గుర్తింపు తెచ్చుకుంటానంటున్నాడు ఈ యాంకర్. గతంలో యాంకర్స్ హీరోలుగా మారి సక్సెస్ అయింది లేదు.. మరి ప్రదీప్ ఏం చేస్తాడో చూడాలిక.