Home Entertainment Television

హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చిన అనసూయ భరద్వాజ్..

జబర్దస్త్ లో ఉన్న కమెడియన్స్ లో హైపర్ ఆది కి మంచి క్రేజ్ ఉంది. ఆయన వేసే పంచ్ డైలాగులు సినిమాలో కూడా వాడుకుంటున్నారు. మొన్నటికి మొన్న రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమాలో కూడా హైపర్ ఆది ప్రస్తావన వచ్చింది అంటే అది క్రేజ్ ఎంతగా పెరిగి పోయిందనేది అర్థం చేసుకోవచ్చు.

Anasuya and Hyper Adi : Jabardasth

ఇదిలా ఉంటే జబర్దస్త్ తన ప్రతి స్కిట్ లో అనసూయ భరద్వాజ్ ఇమేజ్ వాడుకుంటున్నాడు హైపర్ ఆది. ప్రతిసారి ఆమెతో ఎంట్రీ ఇవ్వడం.. లేదంటే ఆమెతో డాన్సులు చేయడం.. పాటలు పాడటం అలవాటు చేసుకున్నాడు. తన స్కిట్స్ మొత్తం అలాగే రాసుకుంటున్నాడు హైపర్ ఆది. దాంతో జబర్దస్త్ లో ఈ జోడికి ప్రత్యేకమైన ఇమేజ్ వచ్చేసింది. అయితే కొన్ని సార్లు తనకు తెలియకుండానే మాట జారుకున్నాడు హైపర్ ఆది. తాజాగా ఒక స్కిట్ లో కూడా అనసూయ గురించి కొన్ని కామెంట్స్ చేశాడు ఈ జబర్దస్త్ కమెడియన్. వచ్చే వారం రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో అనసూయ రెమ్యునరేషన్ గురించి ఓపెన్ అయిపోయాడు హైపర్ ఆది. నువ్వు భలే బాలన్స్ చేస్తావు అనసూయ అంటూ డైలాగ్ చెప్పించి.. ఎందుకు చేయలేదు ఎంత బ్యాలెన్స్ చేయకపోతే అక్కడ ఇక్కడ షోలు చేసి సంపాదిస్తుంది అంటూ హైపర్ ఆది పంచ్ చేశాడు. ఆ తర్వాత మూడు అంతస్తుల కట్టారు కదా అంటే.. ఎందుకు కట్టదు ఒక ఈవెంట్ చేస్తే మూడు లక్షలు ఇస్తారు మాకైతే లక్ష రూపాయలు కూడా ఇవ్వరు అంటూ హైపర్ ఆది సెటైర్లు వేశాడు.

అక్కడే ఉన్న అనసూయ కోపంగా చూస్తూ నీ స్కిట్ లో భాగంగా నా పారితోషికం గురించి ఎందుకు చెబుతున్నాను అన్నట్లు చెయ్యి చూపించి వార్నింగ్ ఇచ్చింది. మొత్తానికి ప్రోమో లోనే చాలా వరకు అనసూయ సీక్రెట్ చెప్పిన హైపర్ ఆది.. రేపు స్కిట్ లో మరెన్ని బయట పెడతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here