Home Entertainment Cinema

టైమ్స్ ఆఫ్ ఇండియాపై అనసూయ భరద్వాజ్ ఫైర్..ఎక్కడో కాలింది!

టెలివిజన్ షో లతో పాటు ఎప్పటికప్పుడు కాంట్రవర్సీ లతో కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది అనసూయ భరద్వాజ్. జబర్దస్త్ కామెడీ షోతో తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరోసారి మీడియా లో సెంటరాఫ్ అట్రాక్షన్ అయిపోయింది. దానికి కారణం టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ప్రకటించిన మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్ టెలివిజన్. ఇందులో జబర్దస్త్ యాంకర్ ప్లేస్ ఏకంగా 14 లో ఉంది. నెంబర్ వన్ గా శ్రీముఖి ని ఎంపిక చేశారు. బిగ్ బాస్ కి వెళ్లి రావడం వల్ల ఆమె క్రేజ్ పెరిగింది అంటూ వాళ్ళు కారణం చెబుతున్నారు. ఇక్కడే అసలు యుద్ధం మొదలైంది.

తన స్థానం 14 లో ఉండటం ఏంటి అని అనసూయ భరధ్వాజ్ టైమ్స్ ఆఫ్ ఇండియా పేరు చెప్పి మరీ విమర్శలు గుప్పించింది. ఈ ర్యాంకింగ్ పద్ధతి చూసిన తర్వాత వాళ్లు సోది చెబుతున్నారని అర్థమైపోయిందని చెబుతోంది అనసూయ. కొన్నేళ్ల కింద వాళ్ళు ఒక అవార్డు కోసం పిలిస్తే తాను వద్దు అని చెప్పినట్లు గుర్తు చేసుకుంది అనసూయ భరద్వాజ్. అప్పటి నుంచి వాళ్ళు తనను పర్సనల్గా టార్గెట్ చేయడం అలవాటు చేసుకున్నట్లు చెప్పింది ఈమె.. తర్వాత కూడా పట్టించుకోవట్లేదు అని చెబుతోంది ఈ జబర్దస్త్ యాంకర్. వాళ్లకు సెలబ్రిటీ లైఫ్ పై వచ్చే ఆదాయం కావాలని.. అలాంటివి రాస్తేనే 5 వేళ్ళు నోట్లోకి వెళ్తాయి అని సెటైర్లు వేసింది అనసూయ. కానీ వాళ్ల అభిప్రాయాలను కూడా గౌరవించాలి. నేను ఏంటో నాకు తెలుసు. వీటి వల్ల నేను ఎఫెక్ట్ కావడం లేదు కాని.. నాశ్రేయోభిలాషులు ఎఫెక్ట్ అవుతున్నారని స్పందిస్తున్నా అంటూ యూట్యూబ్ వీడియో చేసింది అనసూయ.

అందులో తన ప్లేస్ 14 లో పెట్టడంపై ఈమె చాలా బాధపడింది. ఇలాంటి చెత్త అవార్డులు తనకు అవసరం లేదు అంటూ బాగానే మండి పడింది ఈ ముద్దుగుమ్మ. మరీ ముఖ్యంగా జెన్యూన్ గా ఉండే జర్నలిస్టులను తాను ఎప్పుడూ గౌరవిస్తానని కానీ కొందరు మాత్రం తమ పబ్బం గడుపుకోవడం సెలబ్రిటీలతో ఆడుకుంటారు అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. టైమ్స్ ఆఫ్ ఇండియాలో గతంలో కూడా టెలివిజన్ లో ఎక్కడ కనిపించని వాళ్లకు.. ఎక్కడో సైడ్ క్యారెక్టర్లు వేసుకునే వాళ్లకు అవార్డులు ఇచ్చారని అలాంటివి తనకు అవసరం లేదు అని చెప్పింది. ఏదేమైనా కూడా అనసూయ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here