Home Entertainment Cinema

అనసూయతో యుద్ధం చేస్తున్న రోజా.. గెలుపెవరిదో..

తెలుగు ఇండస్ట్రీలో యాంకర్స్ చాలా తక్కువగా ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సుమ కనకాల గురించి. ఆమె తర్వాత అనసూయ భరద్వాజ్, రష్మి గౌతమ్ లాంటివాళ్ళు బుల్లితెరపై సత్తా చూపిస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు పోటీగా ఎమ్మెల్యే రోజా కూడా వచ్చేసింది. ఈమె కూడా కొన్ని రోజులుగా వరుస రియాల్టీ షోలు చేస్తూనే ఉంది. ఇప్పటికే జబర్దస్త్ కామెడీ షో కు జడ్జిగా ఉన్న రోజా బతుకు జట్కా బండి అనే మరో ప్రోగ్రామ్ కూడా చేస్తోంది. మధ్యలో కొన్ని వేరే వేరే షోలు చేసినా కూడా అవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు ఈమె అనసూయ భరద్వాజ్ తో పోటీ పడడానికి సిద్ధమైపోయింది. వీళ్లిద్దరి మధ్య ఎక్కడ యుద్ధం జరుగుతుంది అని ఆశ్చర్యం కలగొచ్చు.

దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి. రోజా ప్రస్తుతం జెమినీ టీవీలో అమ్మ సరిలేరు నీకెవ్వరు అనే కొత్త ప్రోగ్రాం మొదలుపెట్టింది. ఇందులో అమ్మ గొప్పతనం చెబుతూనే పిల్లలతో అమ్మతో ఉండే అనుబంధం గురించి సాగుతుంది. అమ్మను మించిన వాళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని చెప్పడం ఈ షో కాన్సెప్ట్. జబర్దస్త్ పిల్లలతోనే మొదటి ఎపిసోడ్ మొదలు పెడుతుంది రోజా. మార్చి 3 రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ఈ తొలి ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే ఇదే జెమినీ టీవీలో అనసూయ భరద్వాజ్ మరో ప్రోగ్రామ్ మొదలుపెట్టింది. దాని పేరు తల్లా పెళ్లామా. అంటే తల్లి గొప్పదా పెళ్ళాం గొప్పదా అని పోట్లాడుకునే ప్రోగ్రామ్.

సరదాగానే ఉంటుంది కానీ కాస్త కాంట్రవర్సీ ప్రోగ్రాం ఇది. భార్య తల్లి ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే చెప్పడం ఎవరి సాధ్యం కాదు. దీన్నే కాన్సెప్ట్ గా తీసుకొని జెమినీ టీవీ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది. మరోవైపు రోజా మాత్రం అమ్మ కంటే ఎవరు గొప్ప వాళ్ళు కాదు అంటూ అదే చానల్లో చెబుతోంది. అంటే ఈ విషయంలో అనసూయ రోజా మధ్య యుద్ధం జరుగుతుంది. వీళ్ళ మధ్య టిఆర్పి రేటింగ్ వార్ కూడా మొదలైపోయింది. మరి అది ఎలా ఉండబోతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here