Home News Stories

అనకాపల్లి పార్లమెంట్ వైసీపీకి ఆమడదూరమేనా…!

అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో టీడీపీ,వైసీపీ మధ్య పోరు హోరాహోరీ సాగుతోంది. ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకే ఎడ్జ్ కనిపిస్తుంది. వైసీపీలో అంతర్గత విభేదాలు టీడీపీకి కొన్ని నియోజకవర్గాల్లో లాభించాయని చెప్పొచ్చు. మరోవైపు వైసీపీ తరుపున సీనియర్ నేత దాడి వీరభద్రరావు ఎంత ప్రయత్నిస్తున్నా వైసీపీకి కలసి వచ్చే అవకాశం లేదంటున్నారు. తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని ఇక్కడ గ్రౌండ్ లెవల్ సమాచారాన్ని బట్టి తెలుస్తుంది…

అనకాపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పీలా గోవిందసత్యానారాయణ పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి గుడివాడ అమరనాధ్ బరిలో ఉన్నారు. జనసేన నుంచి గంటా శ్రీనివాసరావు బంధువు పరుచూరి భాస్కరరావు ఉన్నారు. దాడి కుటుంబం పూర్తిగా వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్ నాధ్ కు మద్దతు తెలుపుతున్నప్పటికీ పీలా కు కొణతాల సపోర్టు ఉంది. జనసేన అభ్యర్థి కూడా బలంగా ఉండటంతో ఇక్కడ త్రిముఖ పోటీలో ఎవరు గెలుస్తారన్నది చెప్పలేని పరిస్థితి. పీలాపై అవినీతి ఆరోపణలు ఉండటంతో తనకు కలసి వస్తుందని వైసీపీ అభ్యర్థి గుడివాడ అమరనాధ్ నమ్ముతున్నారు.

ఇక గాజువాక నియోజకవర్గానికి వస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్నారు. ఇక్కడ బలమైన అభ్యర్థిగా టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిప్పల నాగిరెడ్డి ఉండగా ఇక్కడ గట్టి పోటీ ఉందంటున్నారు. చోడవరం నియోజకవర్గం విషయానికొస్తే ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కెఎస్ ఎస్ రాజు మళ్లీ పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గట్టి పోటీ ఇస్తున్నారు. గతంలో రెండుసార్లు స్వల్ప తేడాతో ఓటమిపాలయిన కరణం ధర్మశ్రీకి ఈసారి సానుభూతిపనిచేసే అవకాశముంది. దీంతో చోడవరంలో వైసీపీకే గెలిచే ఛాన్స్ ఉంది.

మాడుగుల నియోజకవర్గాన్ని తీసుకుంటే గత ఎన్నికల ఫలితమే రిపీట్ అయ్యే అవకాశముంది. మాడుగుల నుంచి సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు తిరిగి పోటీ చేస్తున్నారు. నియోజవర్గంలో అభివృద్ధి జరగకపోయినా ఆయన నిత్యం ప్రజల్లో ఉండటం కలసి వచ్చే అంశం. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే రామానాయుడు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. మాడుగులలో వైసీపీకి ఛాన్స్ ఉంది. యలమంచిలి నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తిరిగి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు బరిలో ఉన్నారు. కానీ వైసీపీ నేతలు బొడ్డేటి ప్రసాద్, ప్రగడ నాగేశ్వరరావు లు టీడీపీలో చేరడంతో ఇక్కడ వైసీపీకి అవకాశం లేకుండా పోయింది. జనసేన అభ్యర్థి సుందరపు విజయకుమార్ బరిలో ఉండటంతో టైట్ ఫైట్ అని చెప్పవచ్చు.

పాయకరావుపేటలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా డాక్టర్ బంగారయ్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గొర్ల బాబూరావు పోటీచేస్తున్నారు. పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడిఅనితను కొవ్వూరు కు మార్చడంతో ఆమె పై ఉన్న అసమ్మతిని దాదాపుగా టీడీపీ తగ్గించుకోగలిగింది. దీనికి తోడు టీడీపీ అభ్యర్థి బంగారయ్యకు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు వర్గం కూడా మద్దతిస్తుండటంతో కొంత టీడీపీకే ఎడ్జ్ కనపడుతుంది. చివరి నిమిషంలో ఏదైనా ఛేంజ్ అయితే తప్ప టీడీపీకే ఇక్కడ విజయావకాశాలున్నాయి.

నిన్న మొన్నటి వరకూ నర్సీపట్నం డౌట్ కొట్టినా ఇప్పుడు మంత్రి అయ్యన్నపాత్రుడు బలంగా మారారు. మరోసారి నర్సీపట్నం నుంచి పోటీ చేస్తున్న అయ్యన్న పాత్రుడికి ప్రత్యర్థిగా ఉమాశంకర్ గణేష్ వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. వైసీపీ నంచి ముత్యాల పాప, రుత్తుల ఎర్రాపాత్రుడు టీడీపీలో చేరడంతో అయ్యన్న విజయం దాదాపు ఖాయమయినట్లే నంటున్నారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో వైసీపీ వీక్ గా కనపడుతుందనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here