Home Entertainment Cinema

బ్రేకింగ్: అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. పుష్ప సినిమా షూటింగ్ లో గ్యాప్ లేకుండా పాల్గొన్న బన్ని కరోనా బారిన పడ్డాడు. కరోనా సెకండ్‌ వేవ్‌ టెన్షన్ పెడుతున్న సమయంలోనూ పుష్ప సినిమా కు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా షూట్‌ చేస్తున్నారు. షూటింగ్‌ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా బారి నుంచి తప్పించుకోలేకపోయారు అల్లు అర్జున్. సినిమా యూనిట్‌ లో పలువురు ఇప్పుడు కరోనా తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు టాలివుడ్ హీరోలు కరోనా బారిన పడ్డారు. మెగా ఫ్యామిలీకి‌ చెందిన చిరంజీవి,పవన్ కళ్యాణ్,రాంచరణ్ ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నారు. అల్లు అర్జున్‌ కు కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లుగా అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా‌తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here