Home Entertainment Cinema

కార్తి పాత్రలో అల్లు అర్జున్.. సుకుమార్ సినిమా కోసమే..

‘అల వైకుంఠపురములో’ సినిమా విజయంతో గాల్లో తేలిపోతున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రం ఆయన కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ఇప్పటికే 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత భిన్నమైన సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో ఈయన మూడో సినిమా చేయబోతున్నాడిప్పుడు. మహేష్ బాబుతో చేయాలనుకున్న సినిమాను కాస్తా ఇప్పుడు బన్నీతో చేస్తున్నాడు సుకుమార్. ఆయన వద్దన్న కథనే మార్చేసి బన్నీ కోసం సిద్ధం చేసాడు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటించబోతున్నాడని తెలుస్తుంది. చిత్తూరులోని శేషాచలం అడవుల్లో గంధపుచెట్లను కొల్లగొట్టే స్మగ్లర్లతో కలిసి పనిచేస్తాడని.. దానికోసమే లారీ డ్రైవర్‌ గా మారతాడని ప్రచారం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఖైదీ సినిమాలో కూడా కార్తి లారీ డ్రైవర్ గానే కనిపించాడు. ఇక చిత్తూరు కుర్రాడిగా కనిపించేందుకు తన భాషతో పాటు యాసను కూడా మార్చుకుంటున్నాడు బన్నీ. దీనికోసమే ఓ ట్యూషన్ కూడా ప్లాన్ చేస్తున్నాడు. ప్రత్యేకంగా ఓ తెలుగు టీచర్ ను నియమించుకుంటున్నాడు బన్నీ. రంగస్థలం తర్వాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. మరి చూడాలిక.. ఈ చిత్రంతో బన్నీ ఎలాంటి మాయ చేయబోతున్నాడో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here