Home Entertainment Television

అల వైకుంఠపురంలో సన్ నెక్స్ట్ విడుదల తేది ఖరారైంది..ఎప్పుడో తెలుసా?

అల్లు అర్జున్ కెరీర్ లోనే కాదు తెలుగు ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా అల వైకుంఠపురంలో. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఒకటి రెండూ కాదు 160 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు సినిమా మార్కెట్ ఎంతగా పెరిగిందనేది మరోసారి నిరూపించాడు అల్లు అర్జున్. ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని ఈయన చేసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అల వైకుంఠపురంలో సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు. దానికితోడు త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలై 50 రోజులు కావస్తోంది. అయినా ఇప్పటికీ ఒరిజినల్ ప్రింట్ బయటికి రాలేదు.

ఒకప్పుడు విడుదలైన నెలరోజులకే అమెజాన్లో ఒరిజినల్ ప్రింట్ పెట్టేవాళ్ళు. సైరా నరసింహారెడ్డి, సాహో లాంటి భారీ సినిమాలు కూడా విడుదలైన నెలరోజుల్లోనే అమెజాన్ లో దర్శనమిచ్చాయి. కానీ నిర్మాతల మండలి తీసుకున్న కీలక నిర్ణయంతో ఇప్పుడు పెద్ద సినిమాల కోసం దాదాపు 50 రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. అల వైకుంఠపురంలో సినిమా కూడా విడుదలైన ఏడు వారాల తరువాత డిజిటల్ ప్లాట్ ఫాం పై విడుదలవుతుంది. ఈ సినిమాను సన్ నెక్స్ట్ కొనుక్కుంది.

ఫిబ్రవరి 26 నుంచి అల వైకుంఠపురంలో ఒరిజినల్ ప్రింట్ బయటకు రానుంది. దాంతో బన్నీ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు చాలా మంది అభిమానులున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎప్పుడెప్పుడు ఒరిజినల్ ప్రింట్ వస్తుందా అని వేచి చూస్తున్నారు. ఇలాంటి వాళ్లకు ఆ తీపి కబురు చెప్పేసింది సన్ నెక్స్ట్. ఏదేమైనా కూడా థియేటర్ల మాదిరే డిజిటల్ ప్లాట్ ఫాం పై కూడా ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఫిబ్రవరి 26 నుంచి త్రివిక్రమ్ తెరకెక్కించిన ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here