Home Entertainment Cinema

మీడియాపై తొలిసారి సమంత గుస్సా! ఏం రాసేశారో తెలుసా?

ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. సమంత అక్కినేని. ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురించి మాట్లాడింది. అయితే తాను మాట్లాడింది ఒకటైతే.. మీడియా దాన్ని వక్రీకరించి రాసిందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అసలు తను అన్నది ఒకటి.. బయట వచ్చింది ఒకటి అంటూ చెప్పింది ఈమె. తాను మరో రెండేళ్లలో సినిమాలకు బై చెప్పేస్తానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని క్లారిటీ ఇచ్చింది సమంత. ఎప్పటికీ నటిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. అయితే తాను చెప్పింది మాత్రం మరోలా ఉందని.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించి రాసిందని చెబుతుంది అక్కినేని కోడలు.

తాను అలా అనలేదని.. సినిమాల్లో హీరోయిన్స్‌కు ఎక్కువ కాలం అవకాశాలు రావు కాబట్టి ఎప్పటికైనా తప్పుకోక తప్పదు అని చెప్పినట్లు తెలిపింది. అలా చూసుకుంటే తనకు మరో రెండేళ్లు అవకాశాలు వస్తాయేమో.. ఆ తర్వాతైనా కూడా తప్పుకోవాల్సిందే కదా అన్నట్లుగా చెబితే రెండేళ్ళ తర్వాత సమంత రిటైర్మెంట్స్ ఇస్తుందంట అని రాసేసారని.. అది తప్పు అంటుంది సమంత. తప్ప తాను సినిమాలకు గుడ్‌ బై చెప్పబోతున్నట్లుగా ఎక్కడ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చింది. హీరోయిన్‌గా ఛాన్స్‌ వచ్చినా రాకున్నా కూడా సినిమాల్లోనే కొనసాగుతానని..

వెబ్‌ సిరీస్‌లు లేదంటే ఏదో ఒకరకంగా ప్రేక్షకులకు దగ్గరగా ఉంటానని అభిమానులకు కన్ఫర్మ్ చేసింది సమంత. అంతేకానీ రిటైర్మెంట్ ఆలోచనలే లేవని కుండబద్ధలు కొట్టేసింది సమంత అక్కినేని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here