Home News Politics

అఖిలేష్ అందుకే వ‌చ్చాడా?

ఎన్ని ఫోన్‌కాల్స్ చేస్తే ఫ్లైట్ ఎక్కాడో?

మ‌హారాజ రాజ‌శ్రీ….శ్రీ శ్రీ శ్రీ కేసీఆర్‌గారు ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌కోసం తొలి అడుగేశారో లేదో..యావ‌త్ దేశం సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌తో ఆయ‌న‌కేసే చూస్తోంది. ఒక‌ప్పుడు కాంగ్రెస్‌తో విసిగిపోయి..నాలుగేళ్లుగా మోడీ ఏలుబ‌డిలో వేసారిపోయిన కోట్ల‌మంది భార‌తీయుల‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి ఆశాకిర‌ణంలా క‌నిపిస్తున్నారు. ఆయ‌న అద్భుత నాయ‌క‌త్వంలో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ చ‌క్రం తిప్పాల‌నీ, ఈ దేశంలో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ‌శ‌క్తిగా ఎదిగి త‌మ జీవితాలు చిగురించాల‌ని ప్ర‌తీ భార‌తీయుడూ కోరుకుంటున్నాడు. ఏంటి..నిజ‌వే! పాపం..కేసీఆర్ క‌ల‌లుగంటున్న‌ట్లు ఈ ఊహ‌ల‌న్నీ నిజ‌మై ఉంటే ఎంత బాగుండునో. కానీ వినేందుకు ఇబ్బందే అయినా..అంత సీన్లేద‌న్న‌దే వాస్త‌వం.

కానీ ఫోన్ల‌మీద ఫోన్లుచేశాకే… బాగోద‌న్న‌ట్లు ఆయ‌నొచ్చార‌న్న‌ది కాంగ్రెస్ బైట‌పెట్టిన కాల్‌డేటా సాక్షిగా.. బ్రేకింగ్ న్యూస్‌. కేసీఆర్ తానే స్వ‌యంగా 18 సార్లు ఫోన్‌చేసి ఆహ్వానించార‌నేది కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌. క్యాస్ట్ ఈక్వేష‌న్ కూడా క‌లిసొస్తుంద‌ని….

తానేంటి..త‌న రేంజేంటి..అపార‌మైన తెలివితేట‌లు, రాజ‌కీయ అప‌ర‌చాణుక్యుడినైన తాను ఓ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి పాత్ర‌లో ప‌రిమితం కావ‌డమేంట‌న్న ఆలోచ‌న వ‌చ్చిందే త‌డ‌వుగా..ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ప్ర‌క‌ట‌న చేశారు కేసీఆర్‌. రెక్క‌లు క‌ట్టుకుని మ‌మ‌తాబెన‌ర్జీ ముందు వాలిపోయారు. త‌ర్వాత జేడీఎస్ అధినేత దేవెగౌడ‌ని క‌లుసుకున్నారు. గ్యాప్ రాకుండా చూసుకునేందుకు డీఎంకే అధినేత క‌రుణానిధిని కూడా క‌లిసొచ్చారు. మొత్తానికి తెలంగాణ కేంద్రంగా జాతీయ రాజ‌కీయాల్లో సునామీ సృష్టిస్తామ‌న్న‌ట్లే హ‌డావుడి చేశారు. ఇప్పుడు అఖిలేష్ యాద‌వ్ తానే స్వ‌యంగా వ‌చ్చేస‌రికి..ఇంకేముందీ కేంద్రంలో కేసీఆర్ కీల‌కం కాబోతున్నార‌ని హ‌డావుడిచేశారు గులాబీ నేతలు.

నిజంగా ఈ దేశంలో ఓ కొత్త రాజ‌కీయ వేదిక‌కోసం కేసీఆర్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ముచ్చ‌ట‌ప‌డి అఖిలేష్‌యాద‌వ్ త‌నంత‌ట తానే వ‌చ్చుంటే అది వేరే సంగ‌తి. కానీ ఫోన్ల‌మీద ఫోన్లుచేశాకే… బాగోద‌న్న‌ట్లు ఆయ‌నొచ్చార‌న్న‌ది కాంగ్రెస్ బైట‌పెట్టిన కాల్‌డేటా సాక్షిగా.. బ్రేకింగ్ న్యూస్‌. కేసీఆర్ తానే స్వ‌యంగా 18 సార్లు ఫోన్‌చేసి ఆహ్వానించార‌నేది కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌. క్యాస్ట్ ఈక్వేష‌న్ కూడా క‌లిసొస్తుంద‌ని మ‌ధ్య‌లో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌ని పెట్టార‌నేది మ‌రో స‌మాచారం. ఏమైతేనేం..అఖిలేష్‌యాద‌వ్ వ‌చ్చారు. చెప్పాల్సింది చెప్పేశారు. ఆయ‌న స‌మ‌క్షంలోనైనా త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ గురించి కేసీఆర్ క్లారిటీ ఇచ్చుంటే బావుండేది. ఫ్రంట్ కాదంటారు. రాజ‌కీయాల‌కోసం కాదంటారు. మార్పుకోస‌మంటారు. ప‌క్క‌నే కూర్చున్న అఖిలేష్ యాద‌వ్ బీజేపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తే కేసీఆర్ నోటినుంచి ఒక్క మాట లేదు.

మ‌న‌సులో ఏదో ఎజెండా పెట్టుకుని పైకి ప‌దిమందిని క‌లిసినా ప్ర‌యోజ‌నం ఏముంటుంది? త‌న ఉద్దేశ‌మేంటో, వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను చెప్పే ప్ర‌త్యామ్నాయ వేదిక ల‌క్ష్య‌మేంటో స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోతే ఏ పార్టీ అయినా ఎందుకు క‌లిసొస్తుంది. ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వ‌చ్చాక కూర్చోబెట్టి కాసేపు మాట్లాడ‌తారు. పిలిస్తే ఓసారి వ‌చ్చి వెళ‌తారు. అంత‌వ‌ర‌కే. త‌న ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ల‌క్ష్య‌మేంటో ముందు కేసీఆర్ ఓ అంచ‌నాకొస్తే…చ‌క్రం తిప్పే సంగ‌తి త‌ర్వాత చూడొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here