Home News

కాంగ్రెస్ అధ్యక్ష పదవి తనకే కావలంటున్న ఠాగూర్..ఎలాగంటే..!

తెలంగాణ కాంగ్రెస్ పిసిసి చీఫ్ నియామకం ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. అది ఫలానా టైమ్‌కి జరుగుతుందన్న క్లారిటీ కూడా అధిష్టానం నుంచి లేదు. దీంతో అటు నాయకుల్లో, ఇటు క్యాడర్‌లో గందరగోళం నెలకొంది. ఇదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ మరో పదవి పై మనసు పారేసుకున్నారట..దీంతో పీసీసీ చీఫ్‌ ఎంపిక అటుంచి ఇంచార్జ్ మార్పు పై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది. ఇంతకీ ఠాగూర్‌ ఎందుకు వెళ్లిపోతారు అన్నది పెద్ద మిస్టరీగా మారింది.

పీసీసీ చీఫ్‌ ఎంపిక ప్రక్రియలో ఇన్నాళ్లూ బిజీగా ఉన్న కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ మరో పదవి పై గురిపెట్టారట.. తెలంగాణతో పాటు తమిళనాడుకు కూడా కొత్త పీసీసీ సారథిని ఎంపిక చేయాలని హైకమాండ్‌ ఆలోచిస్తోంది. ఆ పోస్ట్‌పై ఠాగూర్‌ ఫోకస్ పెట్టారట. తమిళనాడులో స్టాలిన్‌ ప్రభుత్వంతో కాంగ్రెస్‌కు దోస్తీ ఉంది. అందుకే తమిళనాడు పీసీసీ చీఫ్‌ పదవిపై ప్రయత్నాలు ముమ్మరం చేశారట. కాంగ్రెస్‌ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు చూస్తోన్న KC వేణుగోపాల్‌తో కలిసి ఠాగూర్‌ గట్టిగానే లాబీయింగ్‌ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్‌లో ఏ విధంగా అయితే వర్గ రాజకీయం ఉందో.. తమిళనాడు కాంగ్రెస్‌లోనూ సేమ్‌ సీన్‌. ఠాగూర్‌ అభ్యర్థిత్వాన్ని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోందట. దీనికితోడు రాహుల్‌, ప్రియాంకగాంధీ కోటరీలో ఠాగూర్‌కు ప్రాధాన్యం తగ్గిందనే ప్రచారం స్పీడందుకున్నట్టు చెబుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. ఠాగూర్‌ మాత్రం తమిళనాడు పీసీసీ చీఫ్ పీఠం కోసం ఓ రేంజ్‌లో ట్రై చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు కూడా వెల్లడిస్తున్నాయి. మరి ఆ విషయంలో ఆయన ఎంత వరకు సక్సెస్‌ అవుతారో కానీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చ అయితే మొదలైంది.

ఠాగూర్ తమిళనాడు పీసీసీ చీఫ్‌ అయితే తెలంగాణ AICC వ్యవహారాల ఇంఛార్జ్‌గా తప్పుకోవాల్సి వస్తుంది. ఆయన స్థానంలో కొత్త ఇంఛార్జ్‌ వస్తారని చెవులు కొరుక్కుంటున్నారు. వాస్తవానికి ఠాగూర్‌ ఇంఛార్జ్‌గా వచ్చి ఎంతో కాలం కాలేదు. కుంతియా స్థానంలో ఆయన వచ్చారు. ఇప్పుడు ఠాగూర్‌ వెళ్లి మూడో కృష్ణుడు వస్తే.. రెండేళ్ల వ్యవధిలోనే ముగ్గురు మారినట్టు అవుతుంది. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా.. ఠాగూర్‌ ప్లేస్‌లో వచ్చే కొత్త ఇంఛార్జ్‌ ఎవరనేదానిపై అప్పుడే చర్చోపచర్చలు కాంగ్రెస్‌లో మొదలయ్యాయి.

తెలంగాణ కాంగ్రెస్‌కు ఇంఛార్జ్‌గా ఠాగూర్‌ వచ్చాక.. ఇక్కడ పార్టీ సీనియర్‌ నేతలతో ఆయనకు పొసగడం లేదు. లేఖలు, మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణ పీసీసీకి కొత్త చీఫ్‌ ఎంపిక కసరత్తు కూడా ఢిల్లీలో జరుగుతోంది. అన్ని అనుకున్నట్టు సాగితే తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త పీసీసీ ఛీప్‌తోపాటు.. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ కూడా కొత్త వారు రావొచ్చని అనుకుంటున్నారు. ఠాగూర్ ప్లేస్‌లో ఇంఛార్జ్‌గా ముకుల్‌ వాస్నిక్‌, రమేష్‌ చెన్నితాల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here