తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పది మందిని సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా నియమించింది. వర్కింగ్ కమిటీ ప్రసిడెంట్లుగా జగ్గారెడ్డి, మహేష్ గౌడ్, అంజన్ కుమార్, అజారుద్దీన్, గీతా రెడ్డి లను ఎంపిక చేయగా ప్రచార కమిటీ ఛైర్మన్ గా మధు యాష్కిని నియమించింది.