ఇండియాలో నాకు స్వాగతం పలకడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ప్రధాని మోడీకి కృతఘ్నతలు చెప్తున్నాను. ఈ దేశ చాంపియన్, రాత్రి పగలూ తేడా లేకుండా కష్టపడే మనిషి . నా నిజమైన మిత్రుడు ప్రైమ్ మినిష్టర్ మోడీ.

ఐదు నెలల క్రితం టెక్సాస్‌లోని పెద్ద ఫుట్ బాల్ స్టేడియంలో మీ ప్రధానికి అమెరికా స్వాగతం పలికింది. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో నాకు భారత్ స్వాగతం పలికింది
ప్రధాని మోదీ కేవలం గుజరాత్‌కే గర్వకారణం కాదు. కష్టించి పని చేయడానికి, ఉపాసనకు మీరే సజీవ సాక్ష్యం. భారతీయులు ఏదైనా సాధించగలరు, తాము అనుకున్నది చేయగలరు. ప్రధాని మోదీ అద్భుతంగా ఎదిగారు
ప్రధాని మోదీ ఛాయ్‌వాలా గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.. కానీ మోదీ చాలా దృఢమైన వ్యక్తి.. ఆయన్ను ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు ..
భారత ప్రజాస్వామ్యం అద్భుతం…
భారత్ రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.. ఇంతటి ఘన స్వాగతాన్ని, గొప్ప ఆతిథ్యాన్ని మేం చిరకాలం గుర్తుంచుకుంటాము ..
ప్రపంచ దేశాల ప్రజలు బాలీవుడ్ సినిమాలు, భాంగ్రా డ్యాన్స్‌తో ఆనందిస్తుంటారు .. సచిన్ టెండూల్కర్ , విరాట్ కోహ్లి లాంటి గొప్ప క్రికెటర్లను మీరు ఉత్సాహ పారిస్తారు. షోలే, దిల్ వాలే దునియా లేజాంగే సినిమాలు ఇక్కడ ప్రసిద్ధి పొందాయి.
రక్షణ రంగంలో భారత్, అమెరికా మధ్య సహకారం కొనసాగుతుంది .. ఈ భూమ్మీదున్న అత్యాధునిక, భయంగొల్పే సైనిక పరికరాలను భారత్‌కు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాం . అమెరికా గొప్ప ఆయుధాలను రూపొందించింది .. భారత్‌తో ఒప్పందం చేసుకుంటాము .
ఇస్లామిక్ ఉగ్రవాదం ముప్పు నుంచి పౌరులను కాపాడుకోవడంలో ఇరు దేశాలు ఐక్యంగా ఉండాలి. నేను ఐసిస్ ఉగ్రభూతాన్ని నామరూపాల్లేకుండా చేశాను . భారత్‌తో 3 బిలియన్ డాలర్ల విలువైన రక్షణ ఒప్పందం కుదుర్చుకుంటున్నాం .
ఉగ్రవాదంపై పోరాటానికి భారత్, అమెరికా కట్టుబడి ఉన్నాయి.. ఉగ్రవాద సంస్థలను నాశనం చేయడానికే మేం పాక్‌తో కలిసి పని చేస్తున్నాం . పాకిస్థాన్‌తో తమ సంబంధాలు బాగున్నాయి . పాక్‌లో పురోగతి కనిపిస్తోంది . దక్షిణాసియాలో ఉద్రిక్తతలు తొలగుతాయని, భవిష్యత్తులో సామరస్యం వెల్లివిరుస్తుందని అనుకుంటున్నాను. థాంక్యూ