Home News Politics

ఆదిలాబాద్ లో ఎమ్మెల్యేలకు కేసీఆర్ టార్గెట్ టెన్షన్ ..!

అక్కడి ఎమ్మెల్యేలకు కేసిఆర్ పెట్టిన టార్గెట్ టెన్షన్ పుట్టిస్తోంది .. ప్రతి ఎంపి క్యాండెట్‌కి మూడు లక్షల మెజార్టీ సాధించిపెట్టాలని ఆదేశించారు గులాబీబాస్‌ .. దాంతో నాలుగు లక్షలు సాధిస్తామని పైకి గొప్పగానే చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యేలు .. అయితే ఆ లక్ష్యం నెరవేరుతుందా?… టార్గెట్ రీచ్ కాకపోతే పరిస్థితి ఏంటి? .. అని మల్లగుల్లాలు పడుతున్నారంట ఎమ్మెల్యేలు.. అసలు ఎంపీ ఎన్నికల్లో ఎమ్మెల్యేకొచ్చిన తంటా ఏంటి? .. మెజార్టీ లెక్కలపై జరుగుతున్న తకరారు…

ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు ఎంపి గెలుపుకోసం కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు .. టిఆర్‌ఎస్‌ అభ్యర్ధిని గెలిపించుకోవడానికి ఎండను సైతం లెక్కచేయకుండా తమ అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు .. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి… వాటిలో ఆరుస్థానాల నుంచి గెలిచిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు , ఓడిన మాజీ ఎమ్మెల్యేకు సైతం కేసిఆర్ టార్గెట్ ఫిక్స్ చేసారు. ఆసిఫాబాద్ లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆత్రం సక్కు టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు .. అక్కడ ఓడిన టిఆర్‌ఎస్‌ అభ్యర్ధితో కలిసి నియోజకవర్గం నుంచి యాభై వేల మెజార్టీ తీసుకురావాలని ఆ ఎమ్మెల్యేకి టార్గెట్ ఇచ్చారంట గులాబీబాస్ .. పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అప్పగించి… ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో యాబై వేల మెజార్టీ తగ్గకుండా చూడాలని ఆదేశించారంట.. అంటే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లు కలిపి మూడు లక్షల మెజార్టీ రావాలి .. అంత వస్తేనే గెలిచిన ఎంపిని తన వద్దకు తీసుకురమ్మని గట్టిగా చెప్పారంట

అభ్యర్థి ఎంపికకు ముందు నుంచే జిల్లా ఎమ్మెల్యేలు నగేష్‌కు టికెట్ ఇవ్వవద్దని అధిష్టానంపై వత్తిడి తెచ్చారు .. అయినా నగేష్‌కే అవకాశం దక్కింది .. దాంతో ఎమ్మెల్యేలు ఎక్కడ లైట్ తీసుకుంటారో అని మెజార్టీకి సంబంధించి టార్గెట్ ఫిక్స్ చేసినట్టు ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నారు… అంతేకాదు పదవులు దక్కాలంటే మెజార్టీ ప్రమాణికత అని చెప్పడంతో ఎమ్మెల్యేలు హైరానా పడిపోతున్నారు .. మంత్రి పదవిపై ఆశ ఉన్న ఇద్దరు, నామినేటెడ్ పదవి ఆశిస్తున్న ఒక ఎమ్మెల్యే పోటీపడి ప్రచారం చేస్తున్నారు .. సీఎం ఇచ్చిన టార్గెట్‌ కంటే ఎక్కువ మెజార్టీ తెస్తామంటూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు తామే బరిలో ఉన్నట్టు గల్లీగల్లీ తిరిగేస్తున్నారు

అయితే క్షేత్ర స్థాయి పరిస్థితులు అనుకున్నంత అనుకూలంగా లేవన్న ఆందోళన కనిపిస్తోంది ఎమ్మెల్యేల్లో .. వివిధ వర్గాల్లో కనిపిస్తున్న అసంతృప్తితో పాటు.. ఏజెన్సీ ప్రాంతాల్లో 9తెగల ఆదివాసీలు సైతం అధికార పార్టీ అభ్యర్థికి తమ మద్దతు ఉండబోదని తీర్మానం చేయడాన్ని ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు .. ఇక తాజాగా జరిగిన పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన వాళ్లు ఓడిపోయిన ప్రభావం.. తాము ఆశిస్తున్న మెజార్టీ ఫిగర్‌పై ఎక్కడ పడుతుందో అని ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారు ..

ఇక పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో సైతం ఎమ్మెల్యేలు, పోటీ చేసి ఓడిపోయిన వారు అలాగే తిరుగుతున్నా .. ఇక్కడ వివేక్ ప్రభావం ఎక్కడ పడుతుందో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.. ఎంపి అభ్యర్ధి వలస నేత అవ్వడం.. పైగా చేరిన గంటలోనే టికెట్ ప్రకటించడం పార్టీపై చూపిస్తాయేమో అన్న బెంగ కనిపిస్తోంది వారిలో … ఇక సింగరేణి ప్రాంత ఏరియా ఈ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో ఎక్కువ .. సింగరేణి కార్మికులకు ఐటీ రద్దు అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసినా .. దాని అమలుకు కేంద్రంపై వత్తిడి తేలేదన్న భావన వారిలో ఉందని టిఆర్‌ఎస్‌ శ్రేణులే అంటున్నాయి .. ఏదిఏమైనా పోలింగ్‌ నాటికి పరిణామాలు ఎటు దారితీస్తాయో అన్న భయం ప్రచారం చేస్తున్నవారిలో కనిపిస్తోంది … మరి తమ అధినేత పెట్టిన టార్గెట్‌ని ఎంతమంది రీచ్‌ అవుతారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here