Home News Stories

ఈ జిల్లా అంతటా త్రిముఖ పోరే….అన్నింటా మూడు పార్టీల మధ్య పోటాపోటీ…

ఈ జిల్లాలోని నియోజకవర్గాలన్నింటిలోను త్రిముఖ పోటీ కని పిస్తోంది. గత ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమ ప్రభావంతో వన్‌సైడ్‌ వారే కనిపించిన ఈసారి ఎన్నికల్లో గెలువడం మాత్రం అంత తేలికగా కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు, ఉప సంహారణకు గడువు సమయం ముగి సిపోవడంతో ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరో తేలిపోయింది. దీంతో అభ్యర్థుల బలబలాలు గెలుపో టములపై చర్చ మొదలైంది. ఏసామాజిక వర్గం ఎటు వైపు… ఎవరు గెలువబోతున్నారన్నదే జిల్లాలో ప్రధాన చర్చనీయాంశంగా మారుతోంది. ఆదిలాబాద్ జిల్లా రాజకీయ ముఖచిత్రం పై తెలుగుపాపులర్ టీవీ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్….

ముఖ్యంగా ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపే పట్టణ ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నదే ఆసక్తికర అంశంగా మారుతుంది. ఎందుకంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకే ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పట్టణ ప్రాంతాల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు లేక పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో పట్టణ ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారో అంతుచిక్కడం లేదు. బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ నియోజకవర్గాలలో ఆదివాసీల ఉద్యమం ఈసారి ఎన్నికలపై కొంత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాలలో గిరిజ నేతరుల ఓట్లే కీలకంగా మారనున్నాయి.

టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల అభ్యర్థులు ముందు నుంచే ఊహించిన వారైనా మహాకూటమి అభ్యర్థి మాత్రం అనూహ్యంగా ఖరారు కావడంతో ఆదిలాబాద్‌ రాజకీయం ఆసక్తికరంగా మారింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జోగు రామన్న ఇప్పటికే మూడు సార్లు విజయం సాధించి అదే ఊపులో మళ్లీ విజయపరంపరను కొనసాగించేందుకు దూకుడుతో కనిపిస్తున్నాడు. ఆయనకు అధి కార పార్టీ సంక్షేమ పథకాలు, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కలిసి రావడంతో పాటు సొంత సామాజిక వర్గం అండగా నిలుస్తుందని దీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో గట్టి పోటిని ఇచ్చి ఓడిపోయిన బీజేపీ అభ్య ర్థి పాయలశంకర్‌ ఈసారి గెలుపే లక్ష్యంగా ముందు కు సాగుతున్నారు. తన గెలుపుకు కావాల్సిన అవకా శాలన్నింటిని ఉపయోగించుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌, మహాకూటమి అభ్యర్థుల మధ్య తీవ్రమైన పోటీతో తన గెలుపు ఖాయమని భావిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గండ్రత్‌సుజాత తన సామాజిక వర్గం ఓట్ల తో పాటు ఈసారి రాంచంద్రారెడ్డి, భార్గవ్‌ దేశ్‌పాండేలు మద్దతుగా నిలవడంతో కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకుతో గట్టెక్కెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి ఆదిలాబాద్‌ ఎన్నికల బరిలో 14 మంది ఉన్న ఈ ముగ్గురి మధ్యనే నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కనిపిస్తోంది.

జిల్లాలో ఉన్న బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ రిజర్వ్‌ డు స్థానాల్లో గెలుపుపై అభ్యర్థులు ఎవరి దీమా వారే వ్యక్తం చేస్తున్నారు. ఈమూడు నియోజకవర్గాలలో ఎవరి సామాజిక వర్గం ఓట్లపై వారు నమ్మకంతో కని పిస్తున్న గిరిజనుల కంటే అధికంగా ఉన్న గిరిజనేత రుల ఓట్లే కీలకం కానున్నాయి. బోథ్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాథోడ్‌బాపురావు అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని నమ్ముతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సోయంబాపురావ్‌ మాత్రం ఆదివాసీల ఓట్లన్ని తన వైపే ఉన్నాయని భారీ ఆశలు పెట్టుకున్నారు. చివరి వరకు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నం చేసిన అనిల్‌జాదవ్‌ తన సామాజిక వర్గం ఓట్లతో పాటు గిరిజనేతరుల మద్దతు, సానుభూతి కలిసి వస్తుందని దీమాలో ఉన్నారు. ఇప్పటికే ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు అందించడంతో అనిల్‌జాదవ్‌ మరింత దీమాగా కనిపిస్తున్నారు. ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్‌ అ భ్యర్థి రేఖానాయక్‌, బీఎస్పీ అభ్యర్థి హారినాయక్‌, కాం గ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌రమేష్‌ల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.

ఇక నిర్మల్ నియోజకవ్ర్గంలోను ఇదే పరిస్థితి నెలకొంది. మంత్రి ఇంద్రకరణ్ గులాబీ పార్టీ నుంచి బరిలో దిగగా కాంగ్రెస్ నుంచి మహేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక కాషాయ పార్టీ నుంచి స్వర్ణారెడ్డి కూడా బలమైన అభ్యర్ధిగా పోటీలో ఉండటంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. చెన్నూరులో ఇదే పరిశితి నెలకొంది. ఇక్కడా కాంగ్రెస్ టిక్కెట్ ఆశించిన మాజీ మంత్రి బోడ జానార్ధాన్ బీఎస్పీ నుంచి బరిలో దిగారి. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి బల్క సుమన్,కాంగ్రెస్ నుంచి వెంకటేశ్ నేత పోటీపడుతుండగా జనార్ధాన్ తో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది.

బెల్లంపల్లిలోను రెబల్ అభ్యర్ధి ప్రధాన పార్టీలకు థ్రెట్ గా మారారు. ఇక్కడ గులాబీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రజాకూటమి నుంచి సీపీఐ అభ్యర్ధిగా గుండా మల్లేశ్ పోటీ పడుతుండగా బీఎస్పీ నుంచి టీఆర్ఎస్ రెబల్ గడ్డం వినోద్ వీరికి అడ్డంకిగా మారారు. ముధోల్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధిగా విఠల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రామారావు పటేల్ పోటీపడుతున్నారు. ఇక్కడ బీజేపీ నుంచి పదకంటి రమాదేవి,కాంగ్రెస్ రెబల్ గా నారాయణరావ్ పటేల్ పోటీలో ఉండటంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది.


గత ఎన్నికల్లో ఉద్యమగాలిలో గెలుపొందిన గులాబీ పార్టీ కోటాను ఢీకొట్టేందుకు ఈసారి ప్రతిపక్ష పార్టీలన్ని పోటీ పడుతున్నాయి. ఒక్క ఎంఐఎం పార్టీ తప్పా మిగితా పార్టీలన్ని అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి పోటీ గానే నిలుస్తున్నాయి. ఇప్పటికే మహాకూటమి పేరిటా జత కట్టిన కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ పార్టీలు అధికార పార్టీకి గట్టి పోటీనిచ్చేందుకు వ్యూహా రచన చేస్తున్నాయి. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దే శ్యంతో బీజేపీ ముందుకెళ్తుంది. బోథ్‌, ఖానాపూర్‌లలో కాంగ్రెస్‌ రెబల్స్‌ అభ్యర్థులు అధికార పార్టీతో తేల్చుకు నేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఓటర్ల తీర్పుపైననే అభ్యర్థుల భవితవ్యం ఆధారపడి ఉంది. ఏదోకటి తెలియాలంటే డిసెంబర్‌ 11 వరకు ఆగాల్సిందే మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here