Home News Stories

కొమురం భీం గడ్డ ఎవరి అడ్డా ….

రాష్ట్రంలోనే వరుస క్రమంలో మొదటి నియోజకవర్గం..గోండు రాజుల ఖిల్లా…దట్టమైన అటవి ప్రాంతమున్న జిల్లా…ఎన్నో జలపాతాలు..మరెన్నో పర్యాటక ప్రాంతాలు…చదువులమ్మ సన్నిదున్నబాసర..కవ్వాల్ టైగర్ జోన్ ,కడెం అందాల హరివిల్లు..రాజకీయ చైతన్యం తక్కువే అయినా ఆదివాసీ, లంబాడాల పోరుతో రాజకీయం రసవత్తరంగా మారింది….ఇన్ని ప్రత్యేకతలున్న ఆదిలాబాద్ పార్లమెంట్ పోరు ఆసక్తిగా ఉంది. మరి ఇక్కడ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పై చేయి ఎవ్వరిది…జనం ఏమనుకుంటున్నారు…బరిలో ఉన్న నేతల ధీమా ఏంటీ..

మంత్రిగా పనిచేసిన అనుభవం..సిట్టింగ్ ఎంపీ గా ఉన్న నగేష్ మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు..అసెంబ్లీ స్థానాలకు పోటి చేసిన ఓడిపోయిన సోయంబాపురావ్ బిజెపీ నుంచి,రాథోడ్ రమేష్ కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి ఈసారి ఎంపిగా గెలవాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిదిలో పోటి ఈసారి నువ్వానేనా అనే తరహాలో ఉంది..ప్రదాన పార్టీల ముగ్గురు అభ్యర్తుల మద్య పోటీ తీవ్రంగా ఉంది..ఈపార్లమెంట్ సెగ్మెంట్ రాష్ట్రంలోని నియోజకవర్గాల వరుస క్రమంలో నంబర్ వన్. అభివృద్ది మాత్రం అంతంతే…ఈసెగ్మెంట్ పరిధిలో ఆదిలాబాద్ ,బోథ్ ,నిర్మల్,ముథోల్ ,ఖానాపూర్ ,ఆసిఫాబాద్ ,సిర్పూర్ టి అనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో మహిళా ఓట్లే కీలకం. ప్రస్తుతం ఏడు నియోజకవర్గాల్లో అంతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు..మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో టిఆర్ఎస్ తమ అభ్యర్థులను గెలుచుకోగా ఆసిఫాబాద్ ఒక్కటి మాత్రం కాంగ్రెస్ కైవశం చేసుకుంది..అయితే రాజకీయ సమీకరణాల నేపధ్యంలో గెలిచిన ఆత్రం సక్కు సైతం కారెక్కెడు..దీంతో ఏడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ పటిష్టంగా కనిపిస్తోంది..

తెలంగాణ ఉద్యమం నుంచి ఇక్కడ టిఆర్ఎస్ ప్రభావం పెరిగింది..2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ నుంచి పోటి చేసిన గొడం నగేష్ ఎంపిగా గెలిచాడు..తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి నరేష్ జాదవ్ పై గెలిచిన నగేష్ మళ్లి ఇప్పుడు మరోసారి బరిలో నిలిచాడు.ఎమ్మెల్యేల వ్యతిరేకత,అసెంబ్లీ ఎన్నికల్లో తమ గెలుపుకోసం కష్టపడలేదని సీఎం దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెల్లినా టికెట్ ఇవ్వోద్దని చెప్పినప్పటికి ఆఖరికి అతడినే బరిలో దింపింది గులాబీ పార్టీ అధిష్టానం..ఆదిలాబాద్ పార్లమెంట్ పరిదిలో అనేక సమస్యలున్నాయి..ముఖ్యంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ,ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా రీఓపెంనింగ్ ,ఎయిర్ స్ట్రిప్ లకు అతీగతీ లేదు.సిర్పూర్ పేపర్ మిల్లు మాత్రం ప్రభుత్వం తెరిపించగలిగింది..కాని మిగతా వి పెండింగ్ లోనే ఉన్నాయి..

ఇక మాజీ ఎంపి రమేష్ రాథోడ్ పార్టీలు మారినా టికెట్ మాత్రం సంపాదించారు. గతంలో జడ్పీ చైర్మన్ గా ,ఎంపిగా పనిచేసిన రాథోడ్ కు జిల్లా అంతట మంచి సంబాదాలున్నాయి..తెలుగు దేశంలో ఉన్నప్పడు జిల్లా అంతా ఏకచత్రాదిపత్యం నడిపించిన నేతగా ముద్రపడింది..కాని ఉద్యమ నేపథ్యంలో టిడిపి కనుమరుగు కావడం టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.. టిఆర్ఎస్ లో తన కుటుంబానికి డోఖాలేదు అనే సమయంలో తాను ఎమ్మెల్యే,తన కుమాడు ఎంపిగా బరిలో దింపాలనే ఆశలకు కేసిఆర్ గండికొట్టారు..ఆశతో పార్టీలో కొనసాగినా ఆఖరికి ఖానాపూర్ ఎమ్మెల్యే టికెట్ మళ్లీ సిట్టింగ్ అయినా రేఖానాయక్ కేటాయించడం రమేష్ ఫ్యామిలి కాంగ్రెస్ కండువ కప్పేసుకున్నారు..పార్టీలో చేరిన వెంటనే కాంగ్రెస్ భీ ఫారం ఇచ్చి బరిలో నిలిపింది..అక్కడ ఓటమి ఎదురైంది. కానీ అనూహ్యంగా మళ్లీ రమేష్ రాథోడ్ కే కాంగ్రెస్ ఆదిలాబాద్ పార్లమెంట్ భీ ఫామ్ ఇచ్చేసింది… అయితే రెండు మూడు సార్లు ఓడించారు..ఇప్పుడైనా గెలిపించాలని రమేష్ ప్రచారంలో చెభుతున్నాడు..

ఇక ఆదివాసీ ఉద్యమ నేత తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావ్ సైతం పార్టీలు మారినా జనం బలం లేదా ఆదివాసీల అండతో ఏ పార్టీ అయినా టికెట్ ఇచ్చేస్తోంది..గతంలో ఒక్కసారి బోథ్ ఎమ్మెల్యేగా గెలిచిన సోయం బాపురావ్ ఆ తర్వాత పోటి చేసినా ఓటమిపాలయ్యారు.తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకంటే ముందే హస్తం పార్టీలో చేరాడు..ఇక్కడ బోథ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి తక్కువ మెజార్టీతో టిఆర్ఎస్ చేతిలో ఓటమిపాలయ్యారు..ఆతర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆదిలాబాద్ ఎంపి టికెట్ ఆశించాడు..కాని అధిష్టానం ఆదివాసీ నేతను కాకుండా లంబాడా సామాజికవర్గం నేత అయినా రమేష్ రాథోడ్ కు టికెట్ ఇవ్వడంతో పార్టీకి గుడ్ బై చెప్పి కమలం కండువా వేసుకున్నాడు…దీంతో ఆపార్టీ ఎంపి టికెట్ ఇచ్చేయడంతో బరిలో ఉన్నాడు..తనకు ఆదివాసీల సపోర్ట్ ఉందని ఆదివాసీలకు న్యాయం జరగాలంటే భారతీయజనతా పార్టీకి ఓటెయ్యాలని జనంను అభ్యర్థిస్తున్నాడు..ఇటు ఆదివాసీలు,అటు పార్టీ ఇమేజ్ కలిసొచ్చే అంశాలని బావిస్తున్నారు.

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగిన ఆదివాసీ ఉద్యమ ప్రబావం ఈఎన్నికలపై పడనుంది.ఎందుకంటే లంబాడాలు తమ హక్కులు అవకాశాలు కొల్లగొట్టారని గోండు చేసిన ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది..ఒక ధశలో ప్రభుత్వంకు తీవ్ర తలనొప్పిగా మారింది..ఎస్టీ కోటాలోకి కి వచ్చిన లంబాడాలు తమ ను అన్నిరకాలుగా నష్టపర్చారనే ఉద్యమమెగిసింది..తర్వాత నెమ్మదిగా ఉద్యమ చల్లారింది..అయితే ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం సైతం ఎస్టీకే రిజర్వు నియోజకవర్గం కాబట్టీ అయితే ఆదివాసీ లేదంటే లంబాడా వాళ్లే పోటిలో ఉన్నారు..మొత్తం 11 మంది బరిలో ఉండగా పోటీ మాత్రం ముగ్గురిమద్యే.. ప్రధాన పార్టీలకు చెందిన టిఆర్ఎస్ అభ్యర్థి నగేష్ ఆదివాసీ,అలాగే బిజెపి అభ్యర్థి సోయం ఆదివాసీ,ఇక కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్ లంబాడా కాబట్టి ఆదివాసీల ఓట్లు లంబాడాకు వేయరు..లంబాడాలు ఆదివాసీలకు ఓట్లు వేయకపోవచ్చు..అయితే ఇలాంటి పరిస్థితుల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసేది ఎస్టీలు..అయితే పార్లమెంట్ సెగ్మెంట్ దాదాపు రెండు లక్షలకు పైగా ఆదివాసీ ఓటర్లుండగా లంబాడాలు లక్షలోపున్నారు.


ఎమ్మెల్యేలు,ఎంపి మద్య కాస్త గ్యాప్ ఉన్నా కేసిఆర్ ఆదేశాలతో వ్యక్తిని కాదు పార్టీని గెలిపించాలని తామే అభ్యర్థులమనన్నంతగా ప్రచారం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి అయితే రాష్ట్రమంతాఎలా ఉందో ఆదిలాబాద్ లో అలాగే ఉంది. ఇక గతంలో అసలు బిజెపికే అభ్యర్థులు దొరకలేని పరిస్థితి..మోడి ప్రబావమో ఏమోకాని మొన్నటి ఎన్నికల్లో ముథోల్ ,ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో టగ్గాఫ్ వార్ అధికార పార్టీకి ఇచ్చింది..రెండో స్థానంలో ఇక్కడి అభ్యర్థులు నిలిచారు..ఇక నిర్మల్ ,ఖానాపూర్ ,సిర్పూర్ టి,ఆసిఫాబాద్ ,బోథ్ లలో సాదారణ ఓటు బ్యాంక్ కంటే ఎక్కువగానే ఓట్లు సంపాదించారు ఆ పార్టీ అభ్యర్తులు..ఎక్కడ ఒక్క సీటు గెల్వలేకపోయినా ఓటు బ్యాంక్ మాత్రం ఈసారి ఎన్నికల్లో ఎంపి అభ్యర్థికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here