Home News

జమ్మలమడుగు రెడ్డి కూడా జంపేనా…!

అధికారంలో ఉన్నంతకాలం పెద్దాయన ఏం చెప్పినా … ఏది చేసినా ఈయనకు తెగ నచ్చేసేది… ఎంతలా అంటే ఆగర్భశత్రువుకు తన సిట్టింగ్ సీటు ఇచ్చేంత రేంజ్లో … అలాంటి నేత అధికారం పోగానే పూర్తిగా మారిపోయారు … పెద్దాయన తీరు అస్సలు నచ్చుతున్నట్లు కనిపించడం లేదు … కారణం ఏంటో కాని పదవులు ఇచ్చి అధికారం ఇచ్చిన బాస్ ను కలవడం మానేశారు. .. ఆ అలకకు కారణం లెక్కల్లో తేడానా? లేక పక్కకు దూకడానికి క్రియేట్ చేసుకుంటున్న ప్లానా..? ఇంతకీ అంతలా అలిగిన ఆ నేత ఎవరు?

ఆదినారాయణరెడ్డి… కడప జిల్లా సీనియర్ పొలిటీషియన్‌ … వైసీపీలో గెలిచిన ఆయన టిడిపిలో చేరి మంత్రయ్యారు … అధికారంలో ఉన్నన్నాళ్లూ రోజూ జగన్ మీద ఒకరేంజ్లో ఆరోపణలు చేసిన ఆది.. మొన్నటి ఎన్నికల్లో కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు… మంత్రిగా జిల్లాలో పార్టీని గెలిపించే బాధ్యతను ఆదినారాయణ మీద పెడుతూ…. అన్నీ నువ్వే చూసుకోవాలి… నిన్న నేను తర్వాత చూసుకుంటా? అని చెప్పారట చంద్రబాబు…

సీఎంగా, పార్టీ అధినేతగా ఆదేశించేసరికి ఆదినారాయణ రెడ్డి జిల్లా టిడిపిని భుజాన వేసుకున్నారట… తనకు చంద్రబాబు హామీ ఇచ్చినట్టే… అన్నీ మీరు చూసుకోండి….తర్వాత నేను మిమ్మల్ని చూసుకుంటానని ఆది కూడా అభ్యర్ధులందరికీ అభయం ఇచ్చేశారట .. చంద్రబాబు మాట ఆదినారాయణ రెడ్డి విన్నట్టే…. ఆదినారాయణ రెడ్డి మాట కడప అభ్యర్ధులు తూచా తప్పకుండా పాటించారు.. అంత వరకు బాగానే ఉంది. అసలు సమస్య ఎన్నికల ఫలితాలు వచ్చాకే మొదలైదంట..

కడప జిల్లాలో టీడీపీ ఊడ్చిపెట్టుకుపోయింది… ఎంపీ అభ్యర్ధిగా ఆదినారాయణ రెడ్డి కూడా ఓడిపోయారు… ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఓడిన అభ్యర్ధులు ఆది చుట్టూ తిరగడం మొదలు పెట్టారట… అన్నా మీరు చెప్పారని…. అంత పెట్టాం.. ఇంత పెట్టాం… మీరే చూసుకోవాలంటూ జమా లెక్కల పుస్తకాలు చూపిస్తున్నారట… ఇది చూసిన ఆది… నాదీ సేమ్ టు సేమ్ మీ పరిస్థితే… నాకూ చంద్రబాబు ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదు అని చేతులు ఎత్తేశారట… అంతేకాదు పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉండిపోయారట…

ఇది తెలిసిన చంద్రబాబు ఓ ఎమ్మెల్సీతో లెక్కలు కట్టించారంట.. పెద్దమొత్తంలోనే ఆదికి ముట్టజెప్పేలా అవగాహన కుదిరిందంట.. అయితే అందులో సగం మాత్రమే ఆదినారాయణరెడ్డి చేతికి అందాయని, మిగిలినవి అందకపోవడంతో ఆయన అలిగారని అంటున్నారు… అందుకే…. అనంతపురం జిల్లాలో కార్యకర్తల పరామర్శకు వెళ్లడానికి కడప ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన చంద్రబాబును ఆది కలవలేదు…. మిగిలిన మొత్తం ఇస్తేనే పార్టీ కార్యక్రమాలకు వస్తానని…లేదంటే….రానని తెగేసి చెప్పేశారట మాజీమంత్రి.

ఇంకోవైపు బీజేపీ నేతలతో ఆదినారాయణ రెడ్డి మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది .. ఇటీవల జమ్మలమడుగు వచ్చిన బీజేపీ జాతీయ నేతతో భేటీ అయ్యారు ఆదినారాయణ రెడ్డి… ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వైసీపీ నుంచి రక్షణ పొందాలంటే బీజేపీలో చేరడమే మంచిదని టీడీపీ నేతలు భావిస్తున్నారు… ఆదినారాయణరెడ్డి కూడా అదే బాట పడతారని అంటున్నారు… జగన్ మీద ఏకపక్షంగా విమర్శలు చేసిన ఆదినారాయణ రెడ్డి … వైసీపీకి తాను టార్గెట్ అవుతాననే భయంతో ఉన్నారట… అందుకే సేఫ్ డెన్ చూసుకోవాలనుకుంటున్నారని సమాచారం. ఎలాగూ చంద్రబాబు బాబుకు దూరంగా ఉంటున్నాం కనుక …ఇక చిన్నగా పక్కకు దూకేస్తే పోలా అనే ఆలోచనలో ఉన్నారంట ఆ జమ్మలమడుగు నేత..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here