Home News Politics

అది మహా కూటమా? నీ బొంద కూటమా?

నల్గొండ సభలోను కేసీఆర్ సేం స్టైల్ రిపీట్ చేశారు. విపక్షాల పై మళ్లీ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. 500 కోట్లు ఇస్తడట, మూడు హెలికాప్టర్లు పెడతడట అంటు నిన్న చంద్రబాబు ను టార్గెట్ చేసిన కేసీఆర్ ఈ రోజు నల్గోండలో మరింత రెచ్చిపోయిండు…

అదేదో కేసీఆర్ సార్ మాటల్లోనే వినండి….

అది మహాకూటమా? కాలకూట విషమా?
చంద్రబాబునాయుడు ఇంకో మాట మాట్లాడతుండు.
సిగ్గులేకుండా మాట్లాడుతుండు…

నరేంద్ర మోడీ, కేసిఆర్ ఒక్కటైపోయిర్రు అంటుండు. ఆ మాట అంటానికి కొద్దిగా అన్న సిగ్గుండాలె కదా?

నాలుగేండ్లు నరేంద్ర మోడీ సంకలో ఉన్నావు కదా? నాలుగేండ్లు నరేంద్ర మోడీ సంక నాకితివి కదా?
నాలుగేండ్లు నరేంద్ర మోడీ కాళ్లు మొక్కినవు కదా?

నా 7 మండలాలు గుంజుకున్నది నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకుని కాదా…

నా సీలేరు పవర్ ప్రాజెక్టు గుంజుకున్నది నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకుని కాదా

పైగా నా హైకోర్టు విభజన కానీయలేదు.

నీ నంగనాచి మాటలు, నీకు డబ్బా కొట్టుడు
ఒకటి, రెండు మీడియా సంస్థలను అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నవా.

ఏదైనా చేయగలుగుతా అంటే చంద్రబాబునాయుడూ మాతో గెలుక్కున్నవు జాగ్రత్త. తెలంగాణ దెబ్బ ఏందో తెలిస్తే ఎగిరి విజయవాడ కరకట్ట మీద పడ్డవు.

మేము నీ జోలికి రాలేదు. మాకు 119 ఉంటే నీకు 175 ఉన్నయి. అక్కడ చూసుకో. ఆడ సక్కగ లేదు నీ కథ. ఆగమాగం ఉన్నది. ఈడ దుఖాణం తెరుస్తా అంటున్నవు బిడ్డా….

నేను దబక్కున మూడో కన్ను తెరిస్తే నీ గతి ఏమైతదో ఆలోచించుకో…

విన్నారు కదా ఇది మన సీఎం సార్ విపక్షాల పై చేసిన మాటల దాడి. చెత్త కాంగ్రెస్ బట్టెబాజు గాళ్ళు అంటూ నిన్న నిజమాబాద్ లో మీటింగ్ కి కొనసాగింపా అన్న తీరుగా చెలరేగిపోయాడు. తెలంగాణ ద్రోహుల్ని పార్టీలో చేర్చుకుని పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టిన సీఎం గారు అన్ని మర్చిపోయి ఎదురుదాడి చేసిండంటే విపక్షాలు కూటమిగా కల్లోకొస్తున్నాయమో మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here