Home Entertainment Cinema

మొన్న తొడలు… నేడు నడుము… నితిన్ కోసం రష్మిక మందన్న ఇరగదీస్తోందిగా…

కెరీర్లో ఒక్కోమెట్టు ఎక్కుతుంటే కచ్చితంగా పద్దతులు కూడా మార్చుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు రష్మిక మందన్న కూడా ఇదే చేస్తుంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో మంచి గుర్తింపే తెచ్చుకుంది ఈమె. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత రష్మిక మందన్న రేంజ్ మారిపోయింది. అప్పటి వరకు నార్మల్ హీరోయిన్ గా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు స్టార్ అయిపోయింది. మహేష్ లాంటి సూపర్ స్టార్ తో నటించిన తర్వాత అమ్మడి స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. మార్కెట్ కూడా డబుల్ అయిపోయింది.. రెమ్యునరేషన్ రేంజ్ కూడా మారిపోయింది.

ఇదిలా ఉంటే ఇప్పుడు రష్మిక మందన్న గ్లామర్ షో కూడా డబుల్ అయిపోయింది. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న భీష్మ సినిమాలో రష్మిక అందాల మాయ నడుస్తుంది. ఈ చిత్రం కోసం భారీగానే అందాలను ఆరబోసింది ఈ ముద్దుగుమ్మ. మొన్న విడుదలైన పోస్టర్ లో తొడలు చూపిస్తూ రెచ్చగొట్టిన రష్మిక.. ఇప్పుడు నడుముతో ప్రాణాలు తీస్తుంది. వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఫిబ్రవరి 21న విడుదల కానుంది భీష్మ. అమ్మాయిలకు కాదు.. పెళ్లికి దూరంగా ఉండాలనుకునే కుర్రాడి కథ ఇది.

పూర్తిగా కామెడీ ఓరియెంటెడ్ గానే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు వెంకీ. ఛలో తర్వాత ఈయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాకు రష్మిక కూడా గ్లామర్ షో చేస్తూ తనవంతుగా బాధ్యతను నిర్వర్తిస్తుంది. తాజాగా విడుదలైన పోస్టర్ లో నితిన్ ను వెనక నుంచి గట్టిగా వాటేసుకుంది రష్మిక మందన్న. అందులో అమ్మడి నడుము షో హైలైట్ అవుతుంది. ఇది చూసిన తర్వాత అభిమానులు ఫిదా అయిపోతున్నారు. బాపురే.. భామలో ఈ యాంగిల్ కూడా ఉందా అనిపిస్తుంది.. మొత్తానికి రేపు సినిమా విడుదలైన తర్వాత రష్మిక మందన్న రేంజ్ మరింతగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే వరస సినిమాలతో దూసుకుపోతుంది ఈ బ్యూటీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here