హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి టీఆర్ఎస్, కాంగ్రెస్ రెబల్‌స్టార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆపక్కనే రేవంత్‌రెడ్డి, గద్వాల జేజమ్మ అరుణమ్మ. ఇంకా ఆ రెడ్డీ..ఈ రెడ్డీ..వాళ్ల మధ్యలో జయప్రదారెడ్డి. ఓన్లీ జయప్రదే. కానీ ఇంతమంది పెద్ద రెడ్లమధ్య కూర్చున్నాక ఆమె కూడా ఆ గుంపులో కలిసిపోయినట్లే. జయప్రద రెడ్డి కాదుకదా..చాలామంది చెప్పేదాన్ని బట్టి ఆమెది కళావంతుల కులం. ఆమె మూలాలు ఎక్కడో తూర్పుగోదావరి జిల్లాలో. అలాంటి జయప్రద తెలంగాణలో రెడ్ల మీటింగ్‌లో ప్రత్యక్షమవ్వడం విచిత్రంగానే ఉంది కదూ. మతమార్పిడిలా కులమార్పిడి ఏమన్నా జరిగిపోయిందా. లేదంటే ఈ ఔట్‌డేటెడ్ హీరోయిన్ కమ్ పొలిటీషియన్ తెలంగాణ రెడ్డి నేతలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయిందా?
దాదాపు పాతికేళ్లపాటు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊసేసిన హీరోయిన్. ఆమె టాలెంట్‌ని మెచ్చి చివరికి బాలీవుడ్ కూడా అక్కున చేర్చుకుంది. ఆ తర్వాత ఈ తెలుగుంటి ఆడపడుచు ఎక్కడో యూపీ రాజకీయాల్లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచింది. అమర్‌సింగ్‌కి అత్యంత ఆత్మీయురాలిగా మారిపోయి సమాజ్‌వాదీ పార్టీలో కొన్నేళ్లపాటు ఓ వెలుగు వెలిగింది. అక్కడే రాంపూర్నుంచి ఎంపీగా కూడా గెలిచింది. యూపీ రాజకీయాల్లో తన శకం ముగిసిపోయిందని తేలిపోవటంతో మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ఇస్తుందని ఎప్పట్నించో అనుకుంటున్నారు. తనకు పాతబంధమున్న టీడీపీలోకా? బీజేపీలోకా? లేదంటే వైసీపీలోకా? అదీకాకుంటే..తన జాతి(సినిమా) పక్షికే చెందిన జనసేనలోకా? అన్న చర్చ జరుగుతున్న సమయంలో తెలంగాణ రెడ్ల సభలో వేదికపై తళుక్కుమంటే జనం హాశ్చర్య చకితులైపోకుండా ఉంటారా?
రెడ్ల సమరభేరిలో నాన్రెడ్డి జయప్రద వేదికనెక్కడమేంటి? ఆమెకంత ప్రయారిటీ ఏంటని కొంతమంది జుట్లు పీకేసుకున్నారు. చివరికి సమాధానం దొరికాక అవునా..అంటూ కాస్త స్థిమిత పడ్డారు. బంధుత్వమే జయప్రదకి రెడ్డి వేదికపై చోటు కల్పించింది. జయప్రద సోదరి కుమారుడు సిద్దార్ధ తెలంగాణకు చెందిన నవల్గ సత్యనారాయణరెడ్డి కూతురు ప్రవళ్లికను పెళ్లిచేసుకున్నాడని సమాచారం. రెడ్డి కోడలొచ్చాక అత్త రెడ్డికాకుండా పోతుందా? అందుకే వియ్యంకులవారి ఆహ్వానంతో వచ్చి వేదిక ఎక్కింది. రెడ్డి సమరభేరికి సినీ గ్లామర్ తెచ్చిపెట్టింది. కేవలం రెడ్డిసభకే పరిమితమా..ఈ బంధుత్వంతో నిదానంగా తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తుందా అన్నదే ప్రశ్న. ఏమో చెప్పలేం. ఏపీనుంచి యూపీకి వెళ్లగా లేంది…పక్క రాష్ట్ర రాజకీయాల్లోకొస్తే వింతేముందీ?