Home Entertainment Cinema

ఇలియానా ఏం చేస్తుంది.. అన్ని ఇండస్ట్రీలు హ్యాండిచ్చాయా..?

ఇలియానా.. ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆరేళ్ల త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీతో వ‌స్తుంది. ఒక‌ప్పుడు ఆమె ఏంటి అనే దానిక‌న్నా కూడా ఇప్పుడు ఏంటి అనేది అంద‌రికీ కావాలి. ఇప్పుడు ఆమె సాధార‌ణ హీరోయిన్ కానీ స్టార్ హీరోయిన్ అయితే కాదు. కానీ ఆమెకు రెండేళ్ల కింద 2 కోట్లు ఇచ్చి మ‌రీ స్టార్ హీరోయిన్ ను చేసారు అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ టీం. దాంతో ఇప్ప‌టికీ తెలుగులో త‌న‌కు అదే ఇమేజ్ ఉంద‌నుకుంటుంది ఈ భామ‌. ఈ చిత్రంలో అచ్చంగా హాలీవుడ్ హీరోయిన్ మాదిరే ఉంది ఇలియానా. కానీ ఆ సినిమా మాత్రం డిజాస్టర్ అయిపోయింది. దాంతో మళ్లీ ఇల్లీ బేబీని ఎవరూ పట్టించుకోవడం లేదు. దాంతో ముంబై వీధుల్లోనే తిరిగేస్తుంది ఈమె.

Actress Ileana in Red Skirt

పైగా బరువు కూడా పెరిగిపోయింది. అయినా రీ ఎంట్రీ ఇచ్చేవ‌ర‌కు ఓ అనుమానం.. ఇచ్చిన త‌ర్వాత మ‌రో అనుమానం. ఇప్పుడు ఇలియానా తెలుగు ఇండ‌స్ట్రీలోనే ఉంటుందా.. లేదంటే ర‌వితేజ సినిమాతో ఏదో చుట్ట‌పుచూపుగా న‌టించి వెళ్లిపోతుందా.. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఇదే అనుమానం ఉండేది. అదే అనుమానం కూడా నిజమైందిప్పుడు. ఆ సినమా తర్వాత ఈమె నటిస్తానని చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. డిమాండ్ లేకపోయినా కూడా కోట్లకు కోట్లు అడుగుతుండటంతో కొందరు నిర్మాతలు కనీసం ఇలియానా వైపు చూడలేదు. అప్పట్లో ఖాళీగా ఉన్న ఇలియానాను అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కోసం రెండుకోట్లు చదివించుకున్నారు మైత్రి మూవీ మేక‌ర్స్.

మ‌ళ్లీ అందులో హోట‌ల్ బిల్స్.. అమ్మ‌గారి సౌక‌ర్యాలు కూడా అద‌నం. అవ‌న్నీ కాకుండానే రెండు కోట్ల‌కు పైగా ఇలియానా రెమ్యున‌రేష‌న్. ఇదే అమౌంట్ ఇస్తే పాత ఇలియానా ఎందుకు.. కొత్త పూజా హెగ్డేలే ఎగురుకుంటూ వ‌స్తారు క‌దా అంటున్నారు కొంద‌రు నిర్మాత‌లు. మ‌రోవైపు గోవాబ్యూటీ మాత్రం ఈ చిత్రం త‌ర్వాత తాను తెలుగు ఇండ‌స్ట్రీలోనే ఉంటాన‌ని చెబుతుంది. ఇప్ప‌ట్లో ముంబై వెళ్లే ఆలోచ‌న‌లు కూడా ఈ భామ‌కు ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదు. అయినా కూడా మనోళ్లే బలవంతంగా పంపించేసారు. అక్కడ కూడా ఎవరూ పట్టించుకోకపోవడంతో అటూ ఇటూ కాకుండా అయిపోయింది ఈ జఘన సుందరి పరిస్థితి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here