Home News Stories

ఉత్తరాంద్ర నేతకు వైసీపీలో పట్టు చిక్కట్లేదా….

ఉత్తరాంద్రాలోనే తిరుగులేని నేత గా ఎదిగి డిల్లి లేవేల్లో చక్రం తిప్పిన ఆ నేతకు ఇప్పడున్నపార్టీలో ఇబ్బందులు తప్పడంలేదా ..? గల్లీ నుండి ఢిల్లీ వరకు ఒక వెలుగు వెలిగిన సదరు నాయకుడు ఇప్పుడున్న పార్టీలో ప్రస్తుతం పడరాని పాట్లు పడుతున్నారా? గత మూడు నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులకే జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇప్పించుకొని తన సత్తా చాటిన బొత్స .. ప్రస్తుతం వైసిపిలో ఆ రేంజ్లో చక్రం తిప్పలేకపోతున్నారా ?
విజయనగరం జిల్లాలో గత ఎన్నికలకు ముందు దాదాపు 15 ఏళ్లపాటు చక్రం తిప్పిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా మారిపోయిందనే గుసగుసలు జిల్లాలో వినిపిస్తున్నాయి … రాష్ట్ర విభజన పుణ్యమా అని కాంగ్రెస్ అడ్రస్ కాస్తా గల్లంతవ్వడంతో ఆయన వైసీపీ గూటికి చేరారు… కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ..అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి .కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా , పీసీసీ అధ్యక్షుడిగా, రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి ఆశావాహుల్లో ఒకరిగా .. ఢిల్లీ నేతల వద్ద ఓ వెలుగు వెలిగారు…

నిన్నమొన్నటి వరకూ ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహరాలు బొత్స చక్కబెట్టినా… ప్రస్తుతం రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖలో మకాం వేసి పాదయాత్ర మొదలుకొని, పార్టీ వ్యవహారాలు, ఇతర కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు.. దీంతో బొత్స పరిస్థితి అయోమయంగా తయారైందంట..

బొత్స గతంలో విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర వైసిపి వ్యవహారాలను చక్కబెట్టేవారు… అయితే ప్రస్తుతం విజయసాయిరెడ్డి రావడంతో సీను మారింది … అప్పుడప్పుడు విశాఖ లో ప్రెస్ మీట్లు, ధర్నాలకు మాత్రమే బొత్స పరిమితమవ్వాల్సి వస్తోంది… ఇక పోతే విజయనగరం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తారనుకుంటే .. జిల్లాకు చుట్టం చూపుగా వచ్చి వెళ్లిపోతున్నారు బోత్స. .. ప్రధాన ప్రతిపక్ష పార్టీ సీనియర్‌ నేత పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమౌతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి… ముఖ్యమైన పార్టీ కార్యక్రమం ఉంటే తప్ప బొత్స జిల్లాకి రాకపోతుండటం ఆయన అనుచరులకే మింగుడుపడటం లేదు.. దాంతో జిల్లా వైసీపీలో వర్గపోరు, ఆధిపత్య పోరు ఎక్కువైపోయింది. నాయకుల మధ్య సమన్వయం లేక పార్టీ మూడు గ్రూపులు ఆరు వర్గాలు అన్నట్లు తయారైంది..

జిల్లా కేంద్రంలో కోలగట్ల వర్గం, బొత్స వర్గం గ్రూపుల పోరుతో ఇతర నాయకులు, కార్యకర్తలు నలిగిపోతున్నారు. . జగన్ పాదయాత్ర కూడా త్వరలో జిల్లాలోకి రానున్నా నాయకుల తీరు మాత్రం మారటం లేదు… జిల్లాలో వైసీపీ జెండా ఒకటే అయినా.. ఎవరి ఎజెండా వారిది అన్నట్లుగా వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి.. పార్టీలో ఇంత జరుగుతున్నా జిల్లా వైసీపీ వ్యవహారాలను చక్కదిద్దడానికి బొత్సా ప్రయత్నించడం లేదని సొంత పార్టీ కార్యకర్తలే అంటున్నారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో బొత్స కుటుంబానికి దక్కనున్న అసెంబ్లీ సీట్లు, ఎంపీ సీటుపై పార్టీలోనే చర్చ ఎక్కువ గా జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కూడా చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం అసెంబ్లీ సీట్లు, విజయనగరం ఎంపీ స్దానం నుండి బొత్స కుటుంబ సభ్యులే బరిలో నిలిచారు.. అయితే అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితుల్లో బొత్స కుటుంబానికి నాలుగైదు సీట్లు రావడం కష్టమని .. ఎంపీ సీటుతో కలుపుకొని కేవలం 3 సీట్లు మాత్రమే పార్టీ అధినేత కన్ఫర్మ్ చేశారని సమాచారం …

గజపతినగరం , చీపురుపల్లి అసెంబ్లీ స్థానాలు, విజయనగరం పార్లమెంటు స్ధానం బొత్స కుటుంబానికి దక్కవచ్చంటున్నారు… బొత్సను ఒకవేళ ఎంపీగా విజయనగరం నుంచి పోటీ చేయిస్తే.. చీపురుపల్లి సీటును బోత్సా అనుచరుడు బెల్లాన చంద్రశేఖర్ కు కేటాయించనున్నారని టాక్ … ఒకవేళ బొత్స చీపురుపల్లి నుండి పోటీచేయిస్తే.. విజయనగరం పార్లమెంటు అభ్యర్ధిగా బోత్స సోదరుడు అప్పల నరసయ్యకు కాని.. బెల్లాన చంద్రశేఖర్ కు అవకాశం ఇవ్వాలని జగన్ యోచిస్తున్నట్టు పార్టీ వర్గాలే అంటున్నాయి. .

మరో నియోజకవర్గం నెల్లిమర్ల నుండి సీనియర్ నేత పెన్మత్స సాంబశివరాజుకు జగన్ లైన్ క్లియర్ చేయడంతో ఈసారి బొత్స మేనల్లుడు బడి కొండ అప్పలనాయుడుకు మొండి చెయ్యి ఖాయం అంటున్నారు పార్టీ నేతలు. దీంతో ఇక్కడి పరిస్థితులు పసిగట్టే బడికోండ అప్పల నాయుడు జనసేన అధినేతకు టచ్ లో ఉంటున్నట్టు తెలుస్తోంది … గతంలో జిల్లా రాజకీయాల్లో తిరుగులేని హవా కొనసాగించిన బొత్స ప్రస్తుత పరిస్థితిని జిల్లా వాసులు ఆసక్తికరంగా గమనిస్తున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here