Home News Updates

జగన్ సర్కార్ కు బిగ్ షాక్ ..

ఏపీలో స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 59.85 శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఉన్నత న్యాయస్థానం తిరస్కరించింది. దానికి సంబంధించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 50 శాతానికిపైగా రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది.

నెలలోపు బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here