Home News Updates

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో భారీ అగ్నిప్రమాదం

అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీచేయు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ముంబై కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూణేలోని సీరం సంస్థ మాంజ్రీ ప్లాంట్‌లోని టెర్మినల్-1 గేట్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.

సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. అంతేగాక ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రా జెనెకా అభివృద్ధి చేసినటువంటి కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ కూడా సీరం ఇన్సిస్టీట్యూట్ భారీ ఎత్తున తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కోవీషీల్డ్‌ టీకాలు ప్రమాదం జరినగిన ఈ ప్లాంట్‌లో తయారుకావడం లేదని విశ్వసనీయ సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here