Home Health corona

హైదరాబాద్‌ జూలో సింహాలను వదలని కరోనా..జంతువులనుంచి మనుషులకు సోకుతుందా ?

జంతువులకు కూడా కరోనా సోకుతుందా చాలా మందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. ముఖ్యంగా ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్న వాళ్లను ఈ సందేహం వేధిస్తోంది. హైదరాబాద్‌ జూలో సింహాలకు కరోనా వచ్చిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, సింహాల శాంపిళ్లను పరీక్షించడంతో ఈ విషయంలో స్పష్టత వచ్చింది. ఇంతకీ సింహాలకు వచ్చింది కరోనాయేనా..జంతువుల నుంచి మళ్లీ మనుషులకు వైరస్‌ సోకే ప్రమాదం ఉందా అన్న చర్చ మొదలైంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. ఇప్పటికే లక్షలాది మందిని ఈ వైరస్‌ పొట్టన పెట్టుకుంది. అనూహ్య రీతిలో ఒకరి నుంచి మరొకరి సోకుతోంది. అయితే, ఈ వైరస్‌ మనుషుల నుంచి మనుషులకే కాదు… జంతువులకు కూడా వ్యాపిస్తోంది. హైదరాబాద్‌ జూ పార్క్‌లో 8 సింహాలకు కరోనా సోకినట్టు తేలడంతో ఈ విషయంలో స్పష్టత వచ్చింది.

హైదరాబాద్‌ జూలో ఎనిమిది సింహాలకు కరోనా లక్షణాలు కనిపించాయి. సఫారిలో పా‌ర్క్‌లో ఉంచిన సింహాలకు ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం, దగ్గు వంటి కరోనా లక్షణాలు గమనించారు అక్కడ పని చేస్తున్న పశు వైద్యులు. దీంతో వాటి నమూనాలు సేకరించి… పరీక్షల కోసం హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ మాలిక్యులర్‌ బయాలజీ -సీసీఎంబీకి పంపించారు అధికారులు. దీంతో సింహాలకు కరోనా సోకినట్టు నిర్ధారణైంది.

గతేడాది ఏప్రిల్‌లో న్యూయార్క్‌లోని ఓ జూలో ఎనిమిది పులులు, సింహాలకు కరోనా సోకినట్‌టు నిర్ధారణ అయ్యింది. ఆ తర్వాత హాంకాంగ్‌లో కుక్కలు, పిల్లుల్లో కరోనా లక్షణాలను గుర్తించారు. మన దేశంలో సింహాలు కరోనా బారినపడడం తొలిసారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here