Home Health corona

టీకా తీసుకున్నా 76శాతం మందికి కరోనా..ఐసీఎంఆర్ సంచలనం

కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల తీసుకున్నవాళ్లంతా సేఫేనా అన్నది ఇప్పుడు నడుస్తున్న చర్చ..అయితే ఈ అంశాలపై సంచలన విషయాలు వెల్లడించింది ఐసీఎమ్‌ఆర్‌. రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. వైరస్‌ మహమ్మారి నుంచి తప్పించుకోలేమంటోంది. టీకా తీసుకున్న తర్వాత 76 శాతం మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు రెండే మార్గాలు.. ఒకటి కరోనా నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండటం..రెండో వ్యాక్సిన్‌ తీసుకోవడం..కానీ వ్యాక్సిన్‌ తీసుకున్నా..కరోనా ముప్పు కొనసాగుతుందని చెబుతోంది ఐసీఎమ్‌ఆర్‌.

ఐసీఎమ్‌ఆర్‌ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. రెండు డోస్‌లు వేసుకున్న 76 శాతం మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. అంతేగాక కరోనా సోకిన వారిలో కేవలం 16% మందిలో మాత్రమే ఎలాంటి లక్షణాలు కనిపించకపోగా, 10 శాతం మంది చికిత్స కోసం ఆసుపత్రులలో చేరాల్సి వచ్చిందని అధ్యయనంలో తేలింది. ఈ ఏడాది మార్చి 1 నుంచి జూన్‌ 10 మధ్య జరిగిన ఈ అధ్యయన సమయంలో 361మందికి ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించగా, అందులో 274 మందికి పాజిటివ్‌గా తేలింది. వ్యాక్సిన్‌ రెండు డోస్‌లు తీసుకున్న 14 రోజుల తరువాత ఈ వ్యక్తులకు వైరస్‌ సంక్రమించినట్లుగా గుర్తించారు. కోవిషీల్డ్‌తో పోలిస్తే కోవాగ్జిన్‌ తీసుకునే వారిలో 77% యాంటీబాడీలు మాత్రమే కనిపించాయని అధ్యయనంలో గుర్తించారు. మెడికల్‌ జర్నల్‌ రీసెర్చ్‌ స్క్వేర్‌లో ఈ ఫలితాలు వచ్చాయి.

వ్యాక్సిన్‌ రెండు డోస్‌లు తీసుకున్న తరువాత 274 మందిలోనూ వైరస్‌ జాడను కనుగొన్నారు. వీటిలో 35 శాంపిల్స్ కోవాగ్జిన్‌ రెండు డోస్‌లను తీసుకోగా, 239 శాంపిల్స్‌ కోవిషీల్డ్‌ రెండు డోస్‌లను తీసుకున్నారు. వీళ్లంతా ఆరోగ్య కార్యకర్తలు. కోవిషీల్డ్‌ రెండు డోస్‌ల తర్వాత కరోనా వైరస్‌ సంక్రమణకు గురికావడం మధ్య సగటు వ్యవధి 45 రోజులుగా గుర్తించారు. ఈ సంక్రమణ సగటు వ్యవధి కోవాగ్జిన్‌ తీసుకునే వారిలో 33 రోజులుగా ఉంది.

వ్యాక్సిన్లు వేసిన తరువాత కూడా డెల్టా వేరియంట్‌ సంక్రమణకు కారణమవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ వేరియంట్‌ యాంటీబాడీలను గణనీయంగా తగ్గిస్తుంది. దేశంలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ జనవరి 16 నుంచి జరుగుతున్నప్పటికీ, మార్చిలో వచ్చిన సెకండ్‌ వేవ్‌లో నమోదైన 80%కి పైగా కేసులు డెల్టా వేరియంట్‌తో ముడిపడి ఉన్నాయి. ఇది వేగంగా పెరుగుతూ వచ్చింది. ఈ వేరియంట్‌ కారణంగా వ్యాక్సిన్‌ రెండు డోస్‌లు తీసుకున్న వారిపై కూడా కరోనా వ్యాప్తి ప్రభావం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here