Home News

ఐదు రాష్ట్రాల ఫలితాలు రేపే..బెంగాల్ ఫలితంపై సర్వత్ర ఉత్కంఠ

యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌కి అంతా సిద్ధమైంది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓట్లను లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు గెలుపుపై అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయ్‌. ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు రావడంతో.. అవి ఎంత మేర నిజమవుతాయో.. రేపటి కౌంటింగ్‌తో తేలిపోనుంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశంలో ఉత్కంఠ రేపాయి. పశ్చిమ బెంగాల్‌లో ఏడు విడతల్లో పోలింగ్ జరగ్గా తమిళనాడు, కేరళ ఒకే విడతలో ఎన్నికలకు వెళ్లాయ్‌. ప్రచారం జరిగినంత సేపు రాజకీయం హీటెక్కింది. అయితే పోలింగ్‌ ముగిసి.. ఓట్లు లెక్కింపునకు సిద్ధంగా ఉన్నాయ్‌. కరోనా విజృంభిస్తున్న సమయంలో ఓట్ల లెక్కింపు కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

సిబ్బంది కరోనా బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్‌ మస్ట్‌..! పైగా కౌంటింగ్‌కి వచ్చే ఏజెంట్లు, అభ్యర్థులకు తప్పనిసరిగా ఆర్టీ పీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరి చేసింది ఎన్నికల సంఘం. 48 గంటల్లోపు ఈ టెస్ట్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. డీఈవోలు ఈ టెస్ట్‌లు చేయించాలని ఈసీ స్పష్టం చేసింది. లేకుంటే రెండు డోసుల వ్యాక్సిన్‌ అయినా తీసుకోవాలని చెప్పింది. మరోవైపు కోర్టు ఆదేశాలతో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించింది.

ఇప్పటికే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల కావడంతో ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. పశ్చిమ బెంగాల్‌లో పోరు హోరాహోరీగా ఉంటుందని సర్వేలు తేల్చేశాయ్‌. మోడీ దీదీ ఢీ అంటే ఢీ అంటున్నారు. కొన్ని సర్వేలు మమతకు అవకాశం ఉందని చెప్పినా.. చివరికి పోరు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇక తమిళనాడు డీఎమ్‌కే, కేరళలో ఎల్డీఎఫ్‌ అని దాదాపు అన్ని సంస్థలు తేల్చి చెప్పాయి. అయితే ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ నిజం అవుతాయా లేదా అన్నది రేపటి కౌంటింగ్‌తో తేలి పోనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here