Home News Updates

ఎపి కాబినెట్ నుంచి అయిదుగురు అవుట్ …? త్వరలో నే విస్తరణ

ఏ పి కాబినెట్ నుంచి ఇద్దరు ., ముగ్గురు అవుట్ కానున్నారా… ….కొత్తగా ఐదుగురికి ఛాన్స్ వుండబోతోందా .. అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇప్పుడు ఇద్దరు మంత్రులు రాజ్యసభకు వెళ్తున్నారు. అంటే ఆ
పోస్టులు ఖాళీ కాబోతున్నాయి …ఉప ముఖ్యమంత్రిగా పిల్లి సుభాశ్ చంద్రబోస్ మంత్రిగా మోపిదేవి వెంకటరమణ త్వరలోనే రాజీనామా చేసే అవకాశం ఉంది. వారు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో ఆ రెండు స్థానాలు మంత్రి వర్గంలో ఖాళీ కానున్నాయి.

మరో వైపు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది. అప్పుడు ఏర్పడిన మంత్రివర్గం ఇప్పటివరకు మరల పునరుద్ధరణకు నోచుకోలేదు. ఇప్పుడు ఆ స్థానాలు ఖాళీ అవడంతో మళ్లీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ లో చర్చ సాగుతోంది. ఆ రెండు స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది.

దీంతో పాటు మంత్రులుగా విఫలమైన మరో ఇద్దరు., లేదా ముగ్గురిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాబినెట్ సమావేశం లో జగన్ ఒక హెచ్చ రిక కూడా చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ విస్తరణ స్థానిక ఎన్నికల తర్వాత ఉండవచ్చని చెబుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here