Home Entertainment Cinema

30 రోజుల్లో ప్రేమించడం ఎలా..? యాంకర్ ప్రదీప్ పై పోలీస్ కేసు

ఈ రోజుల్లో వివాదం ఎప్పుడు ఎక్కడ్నుంచి వస్తుందో ఊహించడం కష్టమే. ఇప్పుడు ప్రదీప్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈయన హీరోగా నటిస్తున్నాడు ఇప్పుడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ వస్తున్నాడు ఈ యాంకర్. తెలుగులో ఇప్పటి వరకు యాంకర్స్ హీరోలుగా సక్సెస్ అయింది అయితే లేదు. కానీ తాను చరిత్ర మార్చేస్తానంటున్నాడు ఈయన. అయితే ఇప్పుడు ఈయనపై ఓ యువ దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా రెండు రోజుల జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్‌ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నారని ఈయన ఆరోపించాడు. ఇది నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ దర్శకుడు ఫిర్యాదు చేసాడు. మేడ్చల్‌ జిల్లా కీసర సమీపంలోని రాంపల్లికి చెందిన శ్రీ రామోజు సునిశిత్‌ ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

ప్రదీప్ నటిస్తున్న ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమా త్వరలోనే విడుదల కానుంది. ప్రదీప్‌ గతంలో ఒక అమ్మాయిని వేధించిన ఘటనలో రెండు రోజులు జైలుకు వెళ్లివచ్చాడని.. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రదీప్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ప్రదీప్‌తో పాటు సినీ దర్శకుడు ఇద్దరూ కూడా నిబంధనలను అతిక్రమించారన్నారని ఆయన చెప్పాడు. ప్రస్తుతం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా షూటింగ్‌ జరుగుతుందని.. దాన్ని ఎలాగైనా ఆపాలని ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. న్యాయ సలహా అనంతరం కేసు నమోదు చేస్తామని తెలిపారు. అయితే ఇక్కడే ప్రదీప్ కు అంతా సపోర్ట్ చేస్తున్నారు. జైలుకు వెళ్లొచ్చిన నటులు హీరోగా నటించకూడదంటే.. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి వాళ్లు అసలు జీవితంలో కెమెరా మొహమే చూడకూడదు కదా.. ఏం మాట్లాడుతున్నారు మీరు.. ఫేమస్ కావడం కోసం ఏదో ఓ కేస్ పెట్టి అలా హైలైట్ అవుతారా అంటూ ప్రదీప్ ను అభిమానించే వాళ్లు ఈ దర్శకుడిపై మండిపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here