Home News Updates

రాజధాని తరలింపు ఆలస్యమేనా ….

రాజధాని వ్యవహారంలో కేసులు., విచారణ ఒక కొలిక్కి వచ్చేలా లేదు .. ఇంకా న్యాయ వివాదాలు కొనసాగుతూనే వున్నాయి . దాఖలైన కేసుల విషయంలో రాజధాని వ్యవహారంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అదే విధంగా రాజధానిపై దాఖలైన పిటిషన్లను అంశాల వారీగా విభజించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. హైకోర్టు తరలింపు, రాజధానిలో అభివృద్ధి పనుల కొనసాగింపునకు సంబంధించిన పిటిషన్లపై విచారణను మార్చి 17కి.. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణకు సంబంధించిన బిల్లులు, జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌ కన్సల్టెన్సీ కమిటీ నివేదికలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను మార్చి 30కి వాయి దా వేసింది.
అంటే ఈ కేసులు ఇంకా విచారణ దశలోనే వున్నాయి కనుక తరలింపు ఆలస్యం అయ్యే అవకాశాలు వున్నాయి అంటున్నారు ..

హై కోర్ట్ తరిలింపు పైనా అదే పరిస్థితి …


మరో వైపు హై కోర్ట్ తరలింపు పై సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు దేవదత్‌ కామత్‌, అశోక్‌భాన్‌ వాదనలు వినిపించా రు. అమరావతి నుంచి హైకోర్టును రాష్ట్ర ప్ర భుత్వం తరలించజాలదన్నారు. హైకోర్టు శా శ్వత భవన సముదాయాన్ని అమరావతిలో నిర్మిస్తున్నామని.. న్యాయమూర్తులకు బంగళాలు నిర్మిస్తున్నామని 2018లో రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసిందని, ఆ మేరకే ఉమ్మడి హైకోర్టు విభజనకు సుప్రీంకోర్టు చర్యలు తీసుకుందని తెలిపారు. హైకోర్టు వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదని, ఇది కేంద్రప్రభుత్వానికి సంబంధించినదని పేర్కొన్నారు. అందువల్ల రాజధాని అమరావతిలోనే హైకోర్టు శాశ్వత నిర్మాణాలు కొనసాగించేలా ఆదేశించాలని అభ్యర్థించారు.

రాజధాని అభివృద్ధి పనుల కోసం ఇప్పటికే రూ.11,500 కోట్లు వ్యయం చేశారని, మరో రూ.40 వేల కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్ని నిలిపేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం సైతం రూ.2 వేల కోట్లు ఇచ్చిందని.. అందుల్ల అభివృద్ధి పనులు కొనసాగించేలా ఆదేశించాలని కోరారు. పాలక పార్టీలు మారినప్పుడల్లా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు మారడానికి వీల్లేదని తెలిపారు. రాజధానికి భూములిచ్చిన రైతుల అభిప్రాయాలను ఉన్నతస్థాయి కమిటీ పట్టించుకోలేదన్నారు. కేవలం దురుద్దేశంతోనే రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టిందని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here