Home News

జగన్ రెండేళ్ల పాలన పై జనం అభిప్రాయం ఇదే…!

ఏపీ చరిత్రలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నారు. ఏపీ వైసీపీ పాలన ఎలా ఉంది అన్న దాని పై సర్వత్ర ఆసక్తి ఉంది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ అభివృద్ది కంటే సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వ పాలన మంత్రులు,ఎమ్మెల్యేల పనితీరు పై ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అన్న దానిపై ఒపీనిన్ పోల్ లో ఆసక్తికర విషయాలు ప్రజల అభిప్రాయాల రూపంలో వెలువడ్డాయి.

జగన్ నవరత్నాలు అందరికీ అందుతున్నాయా అన్న దానిపై జగన్ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారు.మంత్రుల పనితీరు ఎలా ఉందన్న దానిపై మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మంత్రుల ఇమేజ్ గత సంవత్సం కంటే కాస్త డౌన్ ఫాల్ లోనే ఉంది. గత ఏడాదితో చూస్తే మంత్రుల పనితీరు పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. రెండున్నరేళ్ల పాలన కాలం తర్వాత మంత్రి వర్గంలో మార్పులు చేస్తానని జగన్ ఇదివరకే ప్రకటించారు.

కరోనా కట్టడిలో జగన్ సర్కారు పనితీరు పై గత సంవత్సరం కంటే కాస్త భిన్నమైన ఫలితం వెలువడింది. కోవిడ్‌ను కట్టడి చేయడంలో జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యల పట్ల సానుకూలంగానే ప్రజలు స్పందించారు. అయితే గత సంవత్సరం తీసుకున్న చర్యలతో పోలిస్తే ఈ సంవత్సరం కరోనా కట్టడిలో కాస్త వెనుకబడినట్లు ప్రజల అభిప్రాయం ఉంది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలు కొనసాగించడం పై మాత్రం ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన ఉంది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థల వల్ల ప్రజలకు మేలు జరుగుతోందని మెజార్టీ ప్రజలు సానుకూలత వ్యక్తం చేశారు.

జగన్ రెండేళ్ల పాలనను స్థూలంగా చూస్తే.. నవరత్నాల రూపంలో సంక్షేమ పథకాలు అందుతుండటం; గ్రామ సచివాలయం, వాలంటీర్ వ్యవస్థల పట్ల జనంలో సానుకూలత వ్యక్తమైంది. కానీ అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడం, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు అంచనాలను అందుకోలేకపోవడం, అవినీతి రహిత పాలన అందడం లేదనే భావన, ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారనే ప్రచారం జగన్ సర్కారుకు మైనస్‌గా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here