Home Entertainment Cinema

వెయ్యి కోట్ల సినిమా ఇక అంతేనా…?

బాహుబలి రిలీజ్ తర్వాత ఆ రేంజ్ సినిమా బడ్జెట్ ఎంత అంటే నిర్మాత కళ్ళు తేలేశా అంతలా మారిపోయింది. బాహుబలిని మించే రేంజ్ లో సినిమా తీసి సత్తా చాటాలనుకుంటున్న పరభాషా దర్శక,నిర్మాతల ప్రాజెక్టు ఒక్కటి ముందుకు సాగడం లేదు…అన్ని సెట్ చేసుకుని సెట్ వరకు వెళ్ళేలోగానే ప్రాజెక్ట్ సర్దుకుంటుంది. ఇప్పుడు మలయాళంలో మహాభారతాన్ని నిర్మించాలనుకున్న బీఆర్ శెట్టి ప్లాన్ కూడా ఇలాగే బెడిసికొట్టినట్లు తెలుస్తుంది.

భారీ ప్రాజేక్ట్ అంటూ హైప్ క్రియోట్ చేస్తున్న సినిమాలు అంతలోనే అటకెక్కుతున్నాయి. మొన్నామధ్య తమిళ దర్శకుడు సుందర్ సి సుమారు 300 కోట్ల బడ్జెట్ తో సంఘమిత్రను ప్రకటించి శృతి హాసన్ టైటిల్ రోల్ లో ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసాడు. కానీ ఇంతలోనే ఏమైందో ఏమో శృతి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో పాటు ఖర్చుకు భయపడిన నిర్మాతలు ఎందుకొచ్చిన రిస్క్ అని దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడుతున్నారు.

ఇప్పుడు మలయాళం ముఖ్య బాషగా మహాభారత కావ్యాన్ని వెయ్యి కోట్ల బడ్జెట్ తో రూపొందించాలన్న నిర్మాత బిఆర్ శెట్టి ప్లాన్ కూడా ఇలాగే బెడిసి కొట్టినట్టు వార్త. సుప్రసిద్ధ రచయిత ఎమ్టీ. వాసుదేవ నాయర్ రచించిన రండమూజం ఆధారంగా స్క్రిప్ట్ వర్క్ చేయించిన శెట్టి మూడేళ్ళలోపు అది పూర్తి చేసుకునే ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇప్పుడా గడువు ముగిసిపోయింది. వాసుదేవనాయర్ తన స్క్రీన్ ప్లే ని కథను వెనక్కు ఇమ్మని డిమాండ్ చేస్తున్నాడు. ఎంత కన్విన్స్ చేసినా వినకపోవడంతో అగ్రిమెంట్ ప్రకారం ఈ ప్రాజెక్ట్అటకెక్కినట్లే తెలుస్తుంది.

భీముడి కోణంలో వాసుదేవనాయర్ రాసినంత అద్భుతంగా దీన్ని ఇప్పటిదాకా ఇంకెవరు రాయలేదని టాక్ నడుస్తుంది. అందుకే శెట్టికి ఆ కావ్యం అంటే మహా మక్కువ. మోహన్ లాల్ ని భీముడిగా ఇండియాలోని స్టార్ హీరోస్ అందరు ఇందులో నటించేలా ప్లాన్ కూడా రెడీ చేశారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, అర్జునుడి పాత్రకు టాలీవుడ్ స్టార్ నాగార్జున కు ఆఫర్ వచ్చిందని అలాగే ఇంకొంతమంది టాలీవుడ్ హీరోస్ ఈ క్రేజీ ప్రాజెక్టులో ఉన్నట్లు వార్తలొచ్చాయి. కానీ రకరకాల కారణాలతో ఈ సినిమా కూడా ఆరంభంలోనే ఆగిపోయింది. డైరక్టర్ శ్రీకుమార్ మీనన్ సారీ చెప్పేసి తప్పుకోగా ప్రొడ్యూసర్ శెట్టి గారు వేరొక స్క్రిప్ట్ తో రీ స్టార్ట్ చేస్తారా లేక ఇక్కడితో పున్ స్టాప్ పెడతారా అన్నది సస్పెన్స్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here