Home Entertainment Cinema

సీక్వెల్స్‌తో సక్సెస్‌ ట్రాక్ ఎక్కాలనుకుంటోన్న ఫ్రెండ్స్

ఆ దర్శకులు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఫస్ట్ సినిమాతోనే టాలీవుడ్‌ని ఇంప్రెస్ చేశారు. కానీ ఈ మధ్య వీళ్ల గ్రాఫ్‌లో కొంచెం డిస్ట్రబెన్సెస్‌ వచ్చాయి. వీటిని క్లియర్ చేసుకోవడానికి ఇద్దరూ సీక్వెల్స్‌నే నమ్ముకున్నారు. మరి కొనసాగింపు కథలతో కష్టాలకి బ్రేకులెయ్యాలనుకుంటోన్న ఆ దర్శకుల పై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

సుధీర్ వర్మ, చందు మొండేటి ఇద్దరూ ఏడాది గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇద్దరూ ఒకే హీరోతోతో కలిసి కెరీర్‌ స్టార్ట్ చేశారు. సుధీర్‌ వర్మ, నిఖిల్‌తో ‘స్వామిరారా’ సినిమా తీస్తే, చందు మొండేటి సేమ్‌ నిఖిల్‌తో ‘కార్తికేయ’ సినిమా తీశాడు. ఈ దర్శకులు ఇద్దరికీ ఫస్ట్ మూవీతోనే మంచి హిట్ వచ్చింది. ఈ సినిమాలతోనే నిఖిల్ కెరీర్‌ కూడా ట్రాక్‌ ఎక్కింది.

సుధీర్‌ వర్మ ‘స్వామిరారా’ తర్వాత తీసిన ‘దోచెయ్, కేశవ, రణరంగం’ సినిమాలు అనుకున్నంతగా రాణించలేదు. ఇక ‘రణరంగం’ తర్వాత సుధీర్‌కి రెండేళ్ల గ్యాప్ వచ్చింది. అయితే ఈ స్లంపు నుంచి బయటపడ్డానికి మళ్లీ ‘స్వామిరారా’ సబ్జెక్ట్‌నే టచ్‌ చేస్తున్నాడు. ఈ మూవీకి సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నాడట దర్శకుడు. చందు మొండేటికి ‘సవ్యసాచి’లో చిన్న షాక్ తగిలింది. అయితే ఈ షాక్ నుంచి తేరుకోవడానికి ఫస్ట్ మూవీ ‘కార్తికేయ’కి సీక్వెల్‌ చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here