Home News

సీఎం కేసీఆర్ ని కలిసిన నాగర్జునసాగర్ ఎమ్మెల్యే భగత్

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన నోముల భగత్ రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.తన గెలుపునకు కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ కి రుణపడి ఉంటానని చెప్పారు నోముల భగత్. నాన్న ఆశయాలు నెరవేరుస్తానని, అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్ధికమంత్రి టి.హరీష్ రావు,ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్,రాష్ట్ర టి ఆర్ యస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్లగొండ జిల్లా టి ఆర్ యస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here