Home News

    ముంబైలో తౌక్టే తుపాను భీభత్సం..అమితాబ్ ఆఫీస్ జలమయం

    ఒక పక్క దేశాన్ని కరోనా వణికిస్తుంటే మరో పక్క ప్రచడం తుఫాన్ పలు రాష్ట్రాల్లో కల్లోలం సృష్టిస్తుంది. కరోనాతో అల్లాడుతున్న ముంబైని రెండు రోజులుగా భారీ వర్ష్షాలు ముంచెత్తుతున్నాయి. నిన్నటి నుంచి ముంబైలో వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఆఫీసు జలమయమైంది. బలమైన గాలులతో ఆఫీస్ లోని ప్లాస్టిక్ కవర్ షీట్లు ఎగిరిపడ్డాయి. రోడ్డు పై పలు చెట్లు సైతం విరిగిపడ్డాయి.

    వరద నీరు తన ఆఫీసును ముంచెత్తినట్లు సోషల్ మీడియా ద్వారా బిగ్‌ బీ తెలిపారు. ఆఫీస్ సిబ్బందికి నిలువ నీడ లేకపోవడంతో తవ వార్డ్ రోబ్ లో దుస్తులు వారికిచ్చినట్లు అమితాబ్ పేర్కోన్నారు. ఫుట్‌బాల్‌ క్లబ్‌ , పింక్‌ పాంథర్స్‌ కబడ్డీ టీమ్‌ టీషర్టులు ఇచ్చినట్లు అమితాబ్‌ తెలిపారు. తౌక్టే తుఫాను నాలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తోంది. అతిభీకరంగా మారిన తుఫాను ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం వైపు వేగంగా పయనిస్తోంది. ముంబై తీరంలో సముద్రంలో భారీ అలలు బెంబేలెత్తిస్తున్నాయి. తీరంలోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. కేరళలో కూడా భారీగా ఆస్థి నష్టం జరిగింది.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here