Home Health corona

భారత్‌లో కరోనా స్పీడుకి కారణం ఇదే..సంచలన విషయాలు బయటపెట్టిన వైరాలజీ ల్యాబ్

భారత్‌లో కరోనా కల్లోలం సష్టిస్తుంది. సెకండ్ వేవ్ లో దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరగడానికి, కరోనా రికవరీ రేటు తగ్గడానికి ప్రధాన కారణాల పై జాతీయ వైరాలజీ ల్యాబొరేటరీ సంచలన విషయాలు బయటపెట్టింది. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా పెరగడానికి, కరోనా రికవరీ రేటు తగ్గడానికి వైరస్‌లో వచ్చిన జన్యు ఉత్పరివర్తనాలే కారణమని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జినోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ పరిశీనలలో స్పష్టమైంది.

కరోనా ఒకటి కాదు, రెండు కాదు… మూడు వేరియంట్లతో విరుచుకుపడుతోంది. ప్రజల ప్రాణాలను తోడేస్తోంది. మూడు వేరియంట్లు, వాటి ఉత్పరివర్తనాలే దేశంలో కరోనా వ్యాప్తికి అసలు కారణమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. యూకేకు చెందిన బి.1.1.7, బ్రెజిల్‌కు చెందిన బి.1.1.28, దక్షిణాఫిక్రాకు చెందిన బి.1.351 వేరియంట్లు… అతివేగంగా వ్యాపిస్తూ… భారత్‌లో కల్లోలం సష్టిస్తున్నాయని చెబుతున్నారు. పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబొరేటరీ పరిశీలనలో కూడా ఇది బహిర్గతమవుతోంది. ఈ మూడు వేరియంట్లే కొంపముంచుతున్నారని గుర్తించారు.

మహారాష్ట్రలో ప్రస్తుతం వ్యాప్తిచెందుతున్న వైరస్‌ను రెండు ఉత్పరివర్తనాలు చెందిన యూకే బి.1.617గా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది ఊపిరితిత్తుల కణాలకు బలంగా అతుక్కుపోతున్నట్టు కనుగొన్నారు. దీని వల్ల ఒకసారి కరోనాకు గురై కోలుకున్న వారి పైనా… తిరిగి వైరస్‌ దాడి చేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పశ్చిమబెంగాల్‌లో బి.1.678 వేరియంట్‌ తీవ్రంగా ఉంది. ఉత్పరివర్తనంలో భాగంగా…వైరస్‌ కొమ్ముల్లోని అమైనో ఆమ్లాలు తొలగిపోవడంతో ఎప్పటికప్పుడు రూపు మార్చుకుని ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా కూడా వ్యాపించే స్థాయికి చేరినట్టు గుర్తించారు.

వైరస్‌ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందడమే దీనికి ప్రధానకారణమని తెలిపారు. చికిత్సకు కూడా అంతుచిక్కకుండా వైరస్‌ రూపు మార్చుకుంటోందని చెప్పారు. గాలి ద్వారా వ్యాపిస్తోంది కాబట్టి మాస్కు విధిగా వాడటం మినహా మరో దారి లేదని..చెబుతున్నారు వైద్య నిపుణులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here