ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకూ పొడగించింది ప్రభుత్వం. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్ సన్నద్ధత పై సీఎం జగన్ సమీక్షించారు. అలాగే ఏపీలో అమలవుతున్న కర్ఫ్యూ పై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది జగన్ సర్కార్. జూన్10 తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయం పొడిగించి ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూ సడలింపు సమయం ఇవ్వనున్నారు. ప్రభుత్వ కార్యాలయాల పనిదినాలు ఉ.8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు ఉండనున్నాయి..

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కర్ఫ్యూ వేళలు క్రమంగా సడలిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సమీక్షా సమావేశానికి వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.