Home Entertainment

బిగ్ బాస్ 5 పార్టిసిపెంట్స్ వీరేనా..నెట్టింట్లో వైరల్

బిగ్ బాస్ 5 కరెక్ట్ గా ఉంటుందో లేదో తెలియదుగాని ..ఒకవేల ఉంటే వచ్చే పార్టిసపెంట్స్ ఎవరు అనేదానిపై మార్కెట్లో గట్టిగానే చర్చ నడుస్తుంది.ఒకరిద్దరు హీరోయిన్స్ తో పాటు టీవీ యాంకర్లు కూడా ఈసారి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ లుగా రావడానికి రెఢీ అవుతున్నారట.మరి అలా రెఢీ అయ్యే పార్టిసిపెంట్స్ ఎవరు..

బిగ్ బాస్ సీజన్ ప్రతి ఏడాది హల్చల్ చేస్తూనే ఉంది.షో స్టార్ట్ అయినప్పుడు ఏముంటుందిలే అని అంతా అనుకునేవారు.తీరా ఒకటి రెండు కాంట్రవర్సీ స్కిట్స్ పడేసరికి ఒక్కసారిగా ఊపందుకుంటూ ఉంటుంది.మొదటిసీజన్ నుంచి ఏముంటుందిలే అనుకున్న ప్రతిసారి ఏదో ఒక గమ్మత్తుతో రియాల్టీ షో ఫుల్ ట్రెండింగ్ లోకి వెళ్తూనే ఉంది.అలాగే ఈసారి షోను మాంచి గ్రిప్పింగ్ గా రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఒకవేల బిగ్ బాస్ 5th సీజన్ అంటూ స్టార్ట్ అయితే అందుల్లో వచ్చే పార్టిసిపెంట్‌ ఎవరనే దానిపై డిస్కషన్స్ నడుస్తున్నాయి.బిగ్ బాస్ లీకుల గోలలు హీరోయిన్లను వదిలిపెట్టడం లేదు. కొత్త సీజన్ మొదలవ్వడం ఆలస్యం, హీరోయిన్ల చుట్టూ ఒకటే పుకార్లు, ఇంకెన్నో ఊహాగానాలు. ఇప్పటికే భూమికపై ఇలాంటి పుకార్లు చాలా వచ్చాయి. తాజాగా ఆమె వాటిని ఖండించింది. ఇప్పుడు పాయల్ రాజ్ పుత్ వంతు వచ్చింది.హిందీ బిగ్ బాస్ కోసం భూమికను సంప్రదించినట్టు పుకార్లు వస్తే.. తెలుగు బిగ్ బాస్ కోసం పాయల్ కు ఆఫర్ చేసినట్టు 2 రోజుల కిందట్నుంచే రూమర్లు మొదలయ్యాయి.

సీజన్-5 ప్రారంభం రోజునే సూట్ కేస్ తో పాటు పాయల్ ను హౌజ్ లోకి పంపిస్తారంటూ కొందరు వాదిస్తే.. సీజన్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకు వైల్డ్ కార్డ్ కింద పాయల్ బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెడుతుందని మరికొందరు చెప్పుకొచ్చారు.ఈ మొత్తం చర్చకు పాయల్ ఫుల్ స్టాప్ పెట్టింది. సింగర్ మంగ్లీ పేరు కూడా వినిపిస్తుంది. అయితే తాజాగా అందుతున్న వార్తల ప్రకారం వర్ష, షణ్ముక్ జశ్వంత్ ,దీపికా పిల్లిలు ఇప్పటికే కన్ఫామ్ అయినట్లు తెలుస్తుంది.ఇక యాంకర్ రవి పేరు కూడా వినిపిస్తుంది గాని అతనికున్న కమిట్మెంట్స్ కి హాజరు కాకపోవచ్చంటున్నారు.ఇక హోస్ట్ ఎప్పటిలాగానే నాగార్జునే ఉండొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here