Home Entertainment Cinema

బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్స్ ఫైనల్ లిస్ట్ ఇదే…!

గత రెండు సీజన్లుగా బుల్లి తెర ప్రేక్షకుల్ని అల్లరిస్తున్న‌ బిగ్ బాస్.. సీజన్- 3 రేపు ఆదివారం‌ నుంచి ప్రారంభం అవుతుంది. హోస్ట్‌గా కింగ్ నాగార్జున వస్తుండటంతో బుల్లితెర ప్రేక్షకుల్లోనే కాకుండా వెండితెర ప్రేక్షకుల్లోనూ బిగ్‌ బాస్ 3 పై స్పెషల్ క్రేజ్ వచ్చేసింది. మొత్తం వంద రోజుల‌పాటు జరుగనున్న ఈ రియాలిటి షో లో పార్టిసిపేట్ చేసే సెలబ్రిటీల పై నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు‌చూస్తున్నారు బుల్లితెర ప్రేక్షకులు. బిగ్ హౌజ్ లో 100 రోజుల పాటు సందడి చేయబోయే 15 మంది
సెలబ్రిటీల పై తెలుగు పాపులర్ టీవీ ఎక్స్ క్లూజీవ్ రిపోర్ట్…

ఫస్ట్ కంటిస్టెంట్ యాంకర్ శ్రీముఖి. తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీ ముఖి‌ ఈసారి‌ బిగ్ బాస్ 3లో సందడి చేయబోతుంది.
ఇక రెండో కంటిస్టెంట్ వి6 తీన్మార్ వార్తలు షోతో గుర్తింపు సంపాదించుకున్న తీన్మార్ సావిత్రి. బిగ్ బాస్ లో ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది తీన్మార్ ఫేమ్ యాంకర్ సావిత్రి అలియాస్ శివజ్యోతి.ఇన్‌స్టాగ్రామ్‌లో సావిత్రి పోస్టు చేసిన ఓ వీడియోలో తాను బిగ్‌బాస్‌-3లో పాల్గొంటున్నట్టు తెలిపింది.

మీడియాలో కేరాఫ్ కాంట్రవర్సీగా పేరు తెచ్చుకున్న TV9 జాఫర్ బిగ్ బాస్ 3 కి మూడవ కంటిస్ట్ంట్ గా సెలక్టయ్యాడు. గత సీజన్ లో కూడా TV9 నుంచి రిపోర్టర్ దీప్తి బిగ్ బాస్ 2 కి సెలక్టయ్యారు. TV9 లో ముఖాముఖి పేరుతో సెలబ్రిటీస్ ని ఇంటర్యూ చేస్తూ ఇరిటేట్ చేసి నిజాలు రాబట్టడం జాఫర్ స్టైల్. ఇక జాఫర్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ ఎన్నికాంట్రవర్సీలకు కేరాఫ్ గా నిలుస్తుందో చూడాలి. ఇక జాఫర్ తో పాటు నాల్గవ కంటిస్టెంట్ గా ఫన్ బకెట్ ఫేమ్ మహేశ్ విట్టా కూడా సెలక్ట్ అయ్యారు. కమెడియన్ గా చిత్తూరు,కడప యాసలో కడుపుబ్బ నవ్విస్తాడు మహేశ్. కృష్ణార్జున యుద్దంతో సినిమాల్లో‌ అడుగుపెట్టారు మహేశ్.

వీరితో పాటు 5,6 కంటిస్టెంట్లుగా యూత్ కపుల్ హీరో వరుణ్ సందేశ్ తన వైఫ్ వితిక షేరు కూడా చాన్స్ దక్కించుకున్నారు. అప్పట్లో ఫేక్ వార్తతో బాగా ఫేమస్ అయింది వితిక. ఆత్మహత్య చేసుకుని ఆస్పత్రిలో ఉన్న వేరే మహిళని వితిక పేరుతో ఆత్మహత్య కి పాల్పడిందంటూ ట్రోల్ చేయడంతో అప్పట్లో భార్య,భర్త లిద్దరు మేంకాదు అంటూ వివరణ కూడా ఇచ్చారు.

తెలుగులో‌ హస్యనటిగా మంచి గుర్తింపు‌ తెచ్చుకున్న హేమ‌ ఏడవ కంటిస్టెంట్ గా సెలక్టయ్యారు. యూ ట్యూబ్‌తో పాటు ఉయ్యాలా జంపాలా లాంటి కొన్ని సినిమాల్లోనూ నటించిన పునర్నవి భూపాలం ఎనిమిదవ కంటిస్టెంట్ గా చాంస్ దక్కించుకున్నారు. హీరోయిన్ తల్లి పాత్రల్లో ఫేమస్ అయిన రోహిణి తొమ్మిదవ కంటిస్టెంట్. తెలుగుతో పాటు చాలా భాషల్లో వందల సినిమాల్లో నటించిన అనుభవం రోహిణి సొంతం.ఇక పదవ కంటిస్టెంట్ గా కొరియోగ్రఫర్‌గా గుర్తింపు సంపాదించుకున్న బాబా భాస్కర్ సెలక్టయ్యారు. భాస్కర్ ట్విట్టర్ ద్వారా తను సెలక్ట్ అయింది‌ ప్రేక్షకులతో పంచుకున్నారు.

కిషోర్ తిరుమల సినిమాలతో ఫేమస్ అయిన మలిరెడ్డి హిమజా రెడ్డి పదకొండవ కంటిస్టెంట్ గా సెలక్ట్ అయ్యారు.
సీరియల్స్, సినిమాలతో పాటు మోడలింగ్‌లోనూ పేరు తెచ్చుకున్న అలీ రెజా పన్నెండవ కంటిస్టెంట్ గా‌ బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టబోతున్నారు. పదమూడవ కంటిస్టెంట్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ చాంస్ దక్కించుకున్నారు. డబ్ స్మాష్‌ తో‌ సమంత‌ డూప్‌ గా‌ పేరు తెచ్చుకుని సోషల్ మీడియాలో‌ ఫేమస్ అయిన అశురెడ్డి బిగ్ బాస్ హౌజ్ లో‌ 14వ కంటిస్టెంట్‌ గా‌ అడుగుపెట్టబోతున్నారు. సీరియల్స్, టీవీ షో‌ల తోనె సక్స్‌స్ కొట్టిన రవి కృష్ణ బిగ్ బాస్ హౌజ్ చివరి‌ కంటిస్టెంట్‌గా హౌజ్ లోకి ఎంటరవుతున్నాడు.

మొత్తం 15 మంది సెలబ్రిటీలు బిగ్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్న ఈ మెగా షో గతంలో మాదిరిగానే శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు, సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here