Home Entertainment

ఫ్యామిలీ మెన్‌-2 వెబ్‌ సిరీస్‌ అసలు వివాదం ఇదే

తమిళనాడులో ది ప్యామిలీమెన్‌ 2 వెబ్‌సిరీస్‌పై నిరసనల సెగలు రగులుతున్నాయి. సమంతను తమిళ యువతి పాత్రలో నెగటివ్‌గా చూపించారని ఈ వెబ్‌సిరీస్‌పై తమిళనాట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వెంటనే నిషేధించాలంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో, పలు రాజకీయ పార్టీలు, తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తమిళనాట ది ఫ్యామిలీ మెన్‌-2 వెబ్‌ సిరీస్‌ పై వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా సీనియర్‌ దర్శకుడు భారతీరాజా ఈ వెబ్‌సిరీస్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళ జాతికి వ్యతిరేకంగా రూపొందిన ది ఫ్యామిలీ మెన్‌ 2 వెబ్‌సిరీస్‌ను ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించకపోవడం బాధాకరమన్నారు. తమిళ ద్రోహులు రూపొందించిన వెబ్‌సిరీస్‌గా అబివర్ణించారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి నిషేధం విధించాలని కోరారు. ప్రసారాన్ని ఆపకుంటే అమెజాన్‌ సంస్థపై పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

జూన్ 4 నుండి ది ఫ్యామిలీ మెన్‌-1 సీక్వెల్‌గా రూపొందిన ది ఫ్యామిలీ మెన్‌-2 అమెజాన్‌ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సమంత అక్కినేని శ్రీలంకకు చెందిన తమిళ యువతిగా న‌టించింది. మొదటిసారి భారీ యాక్షన్ సన్నివేశాలలోనూ కనిపించింది.

సమంత ది ఇందులో త‌మిళ యువ‌తిగా నెగెటివ్ రోల్‌ పోషించడంతో త‌మిళ‌నాడు ప్రజ‌లు మండిప‌డున్నారు. ఇప్పటికే ఈ వెబ్‌ సిరీస్‌ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి పలు రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయి. తాజాగా సీనియర్ దర్శకులు భారతీరాజా మండిప‌డ్డారు. తమిళ ఈలం గురించి ఈ వెబ్‌ సిరీస్‌ లో చూపిన సన్నివేశాలను తొలగించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. నామ్‌ తమిళర్‌ కట్చి పార్టీ అధ్యక్షుడు సీమాన్‌ ట్విట్టర్‌ లో అమెజాన్‌ కు అల్టిమేటం ఇచ్చారు. దీంతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అనే ఆసక్తి ఏర్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here