యంగ్ టైగర్ ఎన్టీఆర్ పొలిటికల్ లైఫ్ కి స్వస్తి చెప్పి 12 సంవత్సరాలైంది. 2009 ఎన్నికల్లో ప్రచారం తర్వాత సైలెంట్ అయి వరుస సినిమాలు చేస్తూ పని తాను చూసుకుంటున్నాడు. మళ్లీ ఇప్పుడు పొలిటికల్ లైన్ లోకి వచ్చిన ఎన్టీఆర్ పవర్ ఫుల్ లీడర్ పాత్రలో పొలిటిషియన్ గా కనిపించబోతున్నారట. ‘కేజీఎఫ్’ఫేమ్ ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్ రోల్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.

ఇంతకు ముందు ఈ సినిమాలో ఎన్టీఆర్ సైంటిస్టుగానో.. మాఫియా డాన్‌గానో నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. దీంతో ఇదే ఫిక్స్ అని అంతా అనుకున్నారు. అయితే, దీనిపై మాత్రం ఎటువంటి క్లారిటీ రాలేదు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఎన్టీఆర్ పొలిటీషియన్‌గా చేస్తున్నాడట. అందుకు తగ్గట్లు ప్రశాంత్ నీల్ కథను సిద్దం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్థుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో సలార్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్నారు.