Home Entertainment Cinema

పవన్ సినిమాలో చాన్స్ దక్కించుకున్న ఇస్మార్ట్ బ్యూటీ..!

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమా హరి హర వీరమల్లులో లక్కీ చాన్స్ కొట్టేసింది ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఇప్పటి వరకు చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న నిధికి ఇది గోల్డెన్ ఆఫర్ గా చెప్పోచ్చు. ఈమె చేసిన సినిమాలు త‌క్కువే అయినా ఆమె అందం, అభిన‌యానికి బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అఖిల్ సరసన మజ్నూ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ బామకు అనుకున్న అవకాశాలు దక్కలేదు. ఇస్మార్ట్ శంక‌ర్‌లో న‌టించి ఇస్మార్ట్ బ్యూటీగా ముద్ర వేసుకుంది. అయ‌తే ఆ త‌ర్వాత ఈమె బాలీవుడ్‌కు లో అవకాశాలు దక్కించుకుంది.

పవన్ కళ్యాణ్ కు తాను పెద్ద ఫ్యాన్ అని అలాంటిది ఆయ‌న సినిమాలో చాన్స్ దక్కడం పై తెగ హడావిడి చేస్తుంది నిధీ అగర్వాల్. ఇదీ భారీ బడ్జెట్ తో రూపోందుతున్న ప్రెస్టేజీయస్ మూవీ కావడంతో భారీ ఆశలు పెట్టుకుంది. ఒక‌వేళ ఈ మూవీ గ‌న‌క పెద్ద హిట్ అయితే తాను స్టార్ హీరోయిన్ కావ‌డం ఖాయ‌మ‌ని ఆమె భావిస్తోంది. ఈ మూవీ.. ఇప్పటికే 50 శాతం పూర్తైందని తెలుస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఈ సినిమాకు భారీగా ఖర్చు పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here