Home News

డిప్యూటీ సీఎం కంటే ఆ అధికారులే అక్కడ పవర్ ఫుల్…!

పశ్చిమగోదావరిజిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తమ మార్క్ పనితీరు చూపిస్తున్నారు. అది ఎంతలా‌‌ అంటే సొంత జిల్లా,సొంత శాఖ అధికారులే డిప్యూటీ సీఎం మాట కూడా లెక్కచేయనంతగా…ఆ శాఖలో పనిచేసే వారిలో చాలామంది ఉద్యోగం ఒక చోట .. విధులు మరోచోట కొనసాగించడం కామన్‌ అయిపోయింది.. మరికొందరైతే అసలు కళ్లకే కనిపించరు.. . అలాంటి వారిపై ఎన్ని ఫిర్యాదులు చేసిన ఫలితం మాత్రం శూన్యం. దాంతో జిల్లాలో పొలిటీషియన్స్‌ కంటే ఆ శాఖ అఫిషియల్సే పవర్‌ఫుల్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది..

పశ్చిమగోదావరిజిల్లా వైద్య ఆరోగ్య శాఖలో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది .. ఏళ్ళ తరబడి ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యతీరును నిలదీసే వారే కనపడటం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా అక్కడ రాజ్యమేలే అవినీతికి మాత్రం ఎండ్ కార్డ్ ఇప్పటి వరకు పడటం లేదంటే .. సదరు అధికారులు ఎంత పవర్‌ఫుల్లో అర్ధం చేసుకోవచ్చు.. అందుకే జిల్లాలో రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులకే పవర్ ఎక్కువ అన్న టాక్‌ వినిపిస్తుంటుంది ..
మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్స్ లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకంటే అత్యధికంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లాగా పశ్చిమకు పేరుంది… పశ్చిమగోదావరిజిల్లా వైద్య ఆరోగ్య శాఖ విభాగం పేరు ఎత్తితే చాలు రాష్ట్ర స్థాయిలో అధికారులు కూడా తల బాదుకుంటుంటారు …

ఇక్కడ అధికారుల‌ స్టైల్ ఏంటంటే ఉద్యోగులు విధి నిర్వాహణ కంటే బ్యాక్‌గ్రౌండ్‌ పెంచుకోవడానికే ప్రాధాన్యమతిస్తారు … ఎదైనా ఆరోపణలు లేదా కంప్లైంట్స్ వస్తే ఆ పలుకుబడితోనే పని కాన్చిచ్చేసుకుంటుంటారు … అందుకే పశ్చిమలో ప్రభుత్వ ఆసుపత్రుల తీరు ఇప్పటికీ మెరుగు పడలేదు… ఇక ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఉద్యోగులను నమ్ముకుని చాలా ప్రైవేటు ఆసుపత్రులు దర్జాగా బతికేస్తున్నాయి .. ఎందుకంటే ప్రభుత్వాసుపత్రులోని ఉద్యోగులపై అక్కడి ప్రైవేటు ఆసుపత్రులకు అంత నమ్మకం… ఒక పక్క జీతం మరోపక్క కమీషన్ల కోసం చాలా మంది ఉద్యోగులు .. ప్రైవేటు ఆస్పత్రులకు బ్రోకర్లుగా పరిచేస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి …

తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే అధికారుల తీరులో కొంచెం అయినా మార్పు వస్తుందా లేదా అని జనం ఆశగా ఎదురు చూశారు… దీనికి కారణం కొత్త ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీటవేస్తామని హమీ ఇవ్వడం ఒకటైతే … పశ్చిమగోదావరిజిల్లా కేంద్ర ఏలూరు ఎమ్మెల్యేగా ఎన్నికయిన ఆళ్లనాని వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం మరొకటి.. నాని మంత్రి పదవి చేపట్టడంతో ఆయనపై అంచనాలు ఎక్కువయ్యాయి. జిల్లా వైద్య శాఖలో పనిచేసే అధికారుల విషయంలో నిస్పక్షపాతంగా వ్యవహరిస్తే సామాన్యులకు వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో పాటు ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెరుగుతుందని అంతా భావిస్తున్నారు…

రాష్ట్రం మొత్తం వైద్య సేవలు మెరుగు పరుస్తామని హమీ ఇస్తున్న ప్రభుత్వం ముందుగా మంత్రి సొంత జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై ఫుల్ ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. ఎందుకంటే మంత్రి ప్రాతినిద్యం వహిస్తున్న ఏలూరు నియోజకవర్గంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి పరిస్థితే ఇలా తయారైంది … డిప్యూటీ‌ సీఎం,వైద్య‌ శాఖా మంత్రిగా‌ ఉన్న ఆళ్లనాని మాట కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. ఏళ్ళ తరబడి ఆసుపత్రిలో పాతుకుపోయిన వారు పేరుకి ప్రభుత్వ ఉద్యోగులైనా.. చేసేది మాత్రం ప్రైవేట్‌ హాస్పటల్స్‌ బ్రోకరేజ్‌ పనే..

ఏ సమయంలో చూసినా ఏలూరు ప్రభుత్వాసుపత్రితో పాటు జిల్లాలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అవస్థలు పడుతున్న పెషెంట్లు వందల్లో కనపిస్తారు… అయినా పనితీరుపరంగా చూస్తే .. లిస్ట్‌లో ఈ జిల్లా లాస్ట్‌లోనే ఉంటుంది.. జిల్లా వైద్యశాఖ అధికారుల తీరుపై ఇప్పటికే ఉన్నతాధికారులు మంత్రికి ఇవ్వాల్సిన ఫీడ్ బ్యాక్ అందించారంట … ఇప్పటి వరకు జిల్లాలోని చాలా మంది ఉద్యోగులను దారిలో పెట్టడం ఎవరి వల్ల కాకపోవడంతో .. స్వయంగా మంత్రి ఆ భాద్యతలు భుజానికెత్తుకున్నారు… ముందు సొంత నియోజకవర్గం చక్కబెట్టుకున్నాక మిగతా వ్యవహారాలపై ఫోకస్ పెడతానని ఉద్యోగులకు చెప్పకనే చెప్పారు… ఆ ఆపరేషన్‌ ఫెయిలా? సక్సెస్‌ అవుతుందా? అంటే వెయిట్‌ అండ్‌ సీనే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here