Home Entertainment Cinema

చిరంజీవి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఏమిటో తెలిసిపోయింది!

చిరంజీవి సినిమాలో మహేష్ బాబు నటిస్తుండటమే ఓ సంచలనం. పైగా ఇది అతిథి పాత్ర కాదు.. సినిమాలో దాదాపు అరగంటకు పైగానే ఉంటాడు సూపర్ స్టార్. అంతేకాదు.. మెగాస్టార్, సూపర్ స్టార్ మధ్య కూడా కొన్ని సన్నివేశాలున్నాయని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ ఎలాంటి పాత్ర చేస్తున్నాడనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. దీనికిప్పుడు కొన్ని సమాధానాలు అయితే వస్తున్నాయి. చిరంజీవి కొరటాల కాంబినేషన్ లో వస్తున్న సినిమా నక్సలిజం నేపథ్యంలో వస్తుంది. ఈ సినిమాలో చిరు కూడా కాసేపు నక్సలైట్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. మొన్నీమధ్యే విడుదలైన ఫోటోలు చూస్తుంటే ఇది నిజమే అని తేలింది కూడా. ఇందులో మహేష్ బాబు కూడా స్టూడెంట్ లీడర్ పాత్రతో పాటు నక్సలిస్ట్ గా కనిపిస్తున్నాడని తెలుస్తుంది. కొరటాల ఈ పాత్రను స్పెషల్ గా డిజైన్ చేస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మహేష్ బాబు ఈ సినిమా కోసం 30 రోజుల డేట్స్ కూడా ఇచ్చాడు. మహేష్ పాత్ర సినిమాలో స్టూడెంట్ లీడర్ అని.. దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అందులో 15 నిముషాల పాటు మెగాస్టార్ తో కాంబినేషన్ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ వార్తపై ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ సినిమాలో మాత్రం కచ్చితంగా మహేష్ పాత్ర అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసమే మెగాస్టార్ కూడా బాగానే బరువు తగ్గిపోయాడు. ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి అద్భుతమైన ట్యూన్స్ సిద్ధం చేసాడు. ఆగ‌స్ట్ 14న విడుద‌ల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మొత్తానికి మెగాస్టార్ సూపర్ స్టార్ కలిసి ఈ సినిమా రేంజ్ మరింత పెంచేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here